భాసిస్తున్నది. రజ్జువే గదా సర్పంగా చెలామణి అవుతున్నది. కనుక తన పాటికి తాను అసత్యమైనా ఇది - తన కాధారమైన సత్యాన్ని అందుకోటానికి తోడ్పడుతుంది. అదీ దీనిలో ఉన్న సుగుణం. అందుకే అసతోమా సద్గమయ అన్నది శాస్త్రం.
ఈ దృష్టితో మళ్లీ మన మర్ధం చేసుకొన్నామంటే భగవద్గీత ఇంతకు ముందు చేసిన వర్ణన అంతా మరొక రూపంగా సమన్వయ మవుతుంది. అది జ్ఞాన దృష్టితో చేసిన దైతే ఇది యోగదృష్టితో చేసే సమన్వయం. కర్మయోగి ఇంకా జ్ఞాని భూమిక నందుకోలేదు. అందుకోటానికి సాధన చేస్తున్నాడు. అది ఎలా చేయాలో వర్ణిస్తున్నది గీత. కేవల మీ క్షణభంగురమైన లోకమే ప్రమాణమని గాక జీవితగమ్యాన్ని బోధించే శాస్త్రప్రమాణాన్ని నమ్మాలి మొదట. నమ్మితే మనకు కనిపించే ఈ లోకమూ ఈ మానవులే గాక వీటి కతీతమైన ప్రకృతి శక్తు లున్నాయని - అవి మనలనూ మన జీవితాలనూ నడుపుతున్నాయని తెలుస్తుంది. ఆ శక్తులే దేవతలు. మనం వ్యష్టిరూపులమైతే అవి సమష్టి రూపం. వ్యష్టి కెప్పుడూ సమష్టి అనేది ఒకటి ఉందనే స్పృహ ఉండాలి. ఈ వ్యష్టి జీవితానికి మూలం కాబట్టి తనజీవితమే ఒక యజ్ఞంగా భావించి తాను జీవితంలో చేసే ప్రతి పనీ దాని ఫలితమూ తన కోసమని ఆసించకుండా ఆ విశ్వశక్తులకే Cosmic Powers సమర్పణ చేయాలి. అంటే నిష్కామంగా కర్మ చేస్తూ పోవాలి. యజ్ఞ శిష్టామృత మంటే నిష్కామ కర్మ యజ్ఞమను కొంటే తత్ఫలితంగా ఈ కర్మయోగి ఎప్పటికైనా సర్వాత్మ భావమనే అసలైన అమృతాన్నే అంటే
Page 236