కర్మ యోగము
భగవద్గీత
బ్రహ్మమేమిటి. బ్రహ్మమంటే అన్నిటి కన్నా పెద్దది ఆకాశతత్త్వం. మొత్తం మీద అన్నం దగ్గరినుంచి బ్రహ్మందాకా పంచభూతాలు ఆరోహణ క్రమంలో కలిసి వచ్చాయి. మరి ఆకాశ మెక్కడి నుంచి. అక్షరం నుంచి. అక్షరమంటే పరమాత్మేనని గదా పేర్కొన్నారు భగవత్పాదులు. అప్పటికి సర్వగతం బ్రహ్మ అంటే వేదం కాదది పరమాత్మ. అది సర్వగతమైనా యజ్ఞంలో ప్రతిష్ఠితమయి ఉంది. యజ్ఞమంటే తేజస్తత్త ్వమని గదా చెప్పాము. తేజస్సు జీవుడే. జీవుడికి తైజసుడని పేరు. పరమాత్మ సర్వత్రా ఉన్నా అది గుర్తించే యోగ్యత ఉన్నవాడు జీవాత్మ. కనుక జీవుడి బుద్ధిలోనే పరమాత్మ ప్రతిష్ఠితుడయి ఉన్నాడనే భావమిది.
ఇప్పుడేమయింది. పంచభూతాలూ పరమాత్మ స్వరూపమే పాంచభౌతికమైన ప్రపంచమూ పరమాత్మే. అలాంటప్పు డిహమూ పరమూ ఇహంలో ఉండే మానవులూ - పరంలో ఉన్నారను కొనే దేవతలూ వీరు వారిని గూర్చి యజ్ఞాలు చేయటం వారు దానికి సంతోషించి వర్షాలు కురిపించటం ఈ కలాపమిక ఎక్కడిది. ఇది కూడా ఆత్మస్వరూపమే. పారమార్ధికంగా చూస్తే ఇక ఏదీ లేదు. అంతా ఆ భాసేనని తేలిపోతుంది.
అయితే ఒక్కమాట. ఎంత ఆ భాన అయినా అది ఎంత వ్యావహారికమైనా దాని వెనకాల పారమార్ధికం పొంచి ఉంటుంది. అసలా మాటకు వస్తే పారమార్థికమే వ్యావహారికంగా భాసిస్తున్నది. అందుకే దాన్ని వ్యావహారిక మని పేర్కొన్నారు. సూర్యరశ్మేగదా ఎండమావులుగా
Page 235