ఉపయోగపడడు. లోకానికీ ఉపయోగపడడు. మోఘం పార్ధ స జీవతి-పశుపక్ష్యాదుల లాగా వ్యర్ధమైన బ్రతుకు బ్రతుకుతుంటాడు. ఏమి కారణం. శాస్త్రచోదితమైన కర్మలేవీ ఆచరించటం లేదు వాడు. ప్రతివాడూ ఏమంచి పనీ చేయక పశువులాగా తిండి తీర్థాలతోనే బ్రతుకు సాగించి చివరకు కన్ను మూస్తే ఈ శాస్త్రవిహితమైన కర్మలెందుకు. ఎవరు చేయాలవి. చేయకుంటే వాటికి ఫలిత మేముంది. ఫలితమే లేని బ్రతుకే అయితే మానవ జీవితమైతేనేమి అది క్రిమికీటకాదుల జీవితమైతే నేమి - ఇందుకేనా ఈ సంసారమనేది ఏర్పడింది. అసలీ సృష్టికే అర్ధం లేకుండా పోతుంది.
తొమ్మిదవ శ్లోకం మొదలుకొని ఇప్పుడీ పదహారవ శ్లోకం వరకూ ఈ ఎనిమిది శ్లోకాలలో వర్ణించిన విషయమేమిటి - తద్ద్వారా భగవద్గీత మనకు చేస్తున్న బోధ ఏమిటి - దానివల్ల మనకు కలిగే ప్రయోజన మేమిటని ప్రస్తుత మిక్కడ మనం సవిస్తరంగా విచారణ చేయవలసి ఉన్నది. యజ్ఞంతో సహా మానవుడు సృష్టి అయ్యాడని - దేవతలకు మనం ఋణపడి ఉన్నామని యజ్ఞం చేసి వారి ఋణం మనం తీర్చుకోవాలని వారికి యజ్ఞఫల మర్పిస్తే వారు ప్రసన్నులయి మనకు కావలసిన వన్నీ ప్రసాదిస్తారనీ ఇలా పరస్పరం సహకరించి నప్పుడే పరిశుద్ధుల మవుతామని అలా కాక స్వార్థచింతనతో బ్రతికితే అంతకన్నా నికృష్టమైన జీవితం లేదనీ వేదవాఙ్మయ మంతా ఇదే మనకు కర్తవ్యమని శాసిస్తున్నదని సాక్షాత్తూ పరమాత్మ నుంచి అది ఆవిర్భవించిందని అది కర్తవ్యమని విధించిన యజ్ఞకర్మ అనుష్ఠించి తీరాలని - దానివల్ల మేఘాలు వర్షించి మనకింత
Page 232