#


Index

కర్మ యోగము భగవద్గీత

ఉపకారకమైన దేవతను యజనం చేయకపోతే అది మహాపచారమని జగచ్చక్రమంతా దానిమీద ఆధారపడి ఉన్నప్పుడది ప్రతి ఒక్కడూ అనుసరించటం వాడి విధి అని కాకుంటే పురుషార్ధానికి నోచుకోక పాడయిపోతాడని శాస్త్రం. ఎన్నో మనకు తెలియని విషయాలు బోధిస్తున్నది

  మానవుడికి తెలియని రహస్యం చెప్పటానికే వచ్చిందసలు శాస్త్రం. ప్రత్యక్షాను మానాల కతీతమైన క్షేత్రంలో శాస్త్రమే మనకు ప్రమాణం. కాదన లేదు. కాని ఇప్పుడింత చిలువలు పలువలు పెట్టి వర్ణించినదంతా ధర్మం క్రిందికి వస్తుంది గాని మోక్ష పురుషార్ధం క్రిందికి రాదు. మోక్షమే జీవిత సమస్యకంతటికీ ఏకైక పరిష్కారం. సర్వమూ ఆత్మ స్వరూపమే ననేజ్ఞానమే గదా మోక్షం. అదే వాస్తవం. దానికి భిన్నంగా ఇకఏది చెప్పినా అదీ అభాసే. వాస్తవం కాదు. ధర్మార్ధ కామాలు మూడూ ఇలాటి ఆభాస క్రిందకే వస్తాయి. ఉందంటే ఉంది. లేదంటే లేదు. అదీ అభాస అంటే. వస్తుతంత్రం కాదది బుద్ధితంత్రం. Notional అర్ధకామా లైహికం కాబట్టి అది ఆభాస అయితే కావచ్చు. ధర్మ మా ముష్మికం కదా - అది కూడా మిధ్యాభూత మేనా అని శంకించ బని లేదు. త్రిగుణాత్మకమైన ప్రతి ఒక్కటీ అసత్యమే. త్రైగుణ్య విషయా వేదా అని గీతే చాటుతున్నది. వేదవాఙ్మయమే త్రిగుణాత్మకమని నిర్ణయించి నప్పుడిక అది బోధించే దేవత లెక్కడున్నారు. వారి కోసం చేసే యజ్ఞాలెక్కడ ఉన్నాయి. అంతా వట్టిదే.

  మరి అంతా వట్టిదే అయితే ఇంతదూరం శాస్త్రం మనకిదంతా ఏకరువు పెట్టటం దేనికని ప్రశ్న వస్తుంది. దీనికి వేదాంతులు చేసే

Page 233

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు