#


Index

కర్మ యోగము భగవద్గీత

  ఈ విధంగా వేదమూ అది బోధించే కర్మకాండా దానివల్ల నిత్యమూ సాగిపోయే ఈ లోకయాత్రా - ఇదంతా ఒక చక్రం లాంటిది. సంసార చక్రమిది. చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడూ. అలా తిరుగుతూ ఉంటే పైది క్రిందికీ క్రిందిది పైకీ ఆ వృత్తి కాక తప్పదు. అంటే ఆది నుంచి అంతం అంతం నుంచి ఆది వలయాకారంగా వస్తూ పోతుంటాయని అర్ధం. అప్పుడే ప్రతి ఒక్క మానవుడికీ అందులో ప్రవేశం. ఒకడా చక్రభ్రమణంలో పుట్టాడు బ్రతికాడు పోయాడంటే వాడితోపాటు పోదుగదా అది దాని పాటికది తిరుగుతూ ఉండవలసిందే. అప్పుడే పుట్టేవాడు పుడుతుంటే పోయే వాడుపోతుంటే అందరికీ లభిస్తుంది అందులో అవకాశం.

  ఏవం ప్రవర్తితం చక్రం. అయితే అది అచేతన మా సంసార చక్రం. సంసారి అయిన జీవుడు తిప్పితేనే అది తిరుగుతూ పోతుంది. అందుకే ప్రవృత్త మనకుండా ప్రవర్తిత మని వ్రాస్తున్నారు వ్యాసభగవానుడు. యజ్ఞ కర్మానుష్ఠానమే సంసారి అయిన మానవుడు దాన్ని త్రిప్పటం. నానువర్తయ తీహ యః ఎవడలా తిప్పకుండా పోతాడో. అఘాయు రింద్రియారామః - వాడి జీవనం పాప జీవనం Sinful Life. ఎందుకంటే ఇంద్రియారాముడయి బ్రతుకుతుంటాడు వాడు. ఇంద్రియార్థాలు సేవించటమే వాడికి జీవిత పరమార్ధం. చివరకు వాడు తనకూ

Page 231

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు