#


Index

కర్మ యోగము

  మరి ఇంత పకడ్బందుగా కర్మేంద్రియా లన్నిటినీ ఇటూ అటూ కదలకుండా బంధించి ఆసనం వేసుకొని ఈ యోగి సాధించింది ఏమిటింతకూ. మనసుతో స్మరిస్తూ కూచోటమా. ఆ స్మరించటమైనా ఆత్మను గాక అనాత్మ భావాలను ధ్యానిస్తూ కూచున్నాడాయె. ఇక వాడలా కూచుంటే ఎంత కూచోకుంటే ఎంత. కర్మేంద్రియాలను కొన్నిటిని నిరోధించినంత మాత్రాన ఏమి ఫలం. మనసలాగే పని చేస్తున్నది గదా. దాని నరికట్ట లేక ఏదో పెద్ద ఘనకార్యం చేశాను నేను మహాయోగినని గొప్పలు చెప్పుకోట మర్ధం లేని వ్యవహారం.

  అంతేకాదు. విమూఢాత్మా - మిధ్యా చార స్స ఉచ్యతే. అలాటి వాడి ఆచారమది మిధ్యాచారం. అది ఏ గొప్ప ఫలితమూ సాధించలేని ప్రవర్తన. ఫలితాన్ని ఇచ్చేదయితే అది సదాచారం Right Conduct క్రిందికి వస్తుంది. అలాటిది కాని పక్షంలో అది మిధ్యాచారమే Bogus. దానికి కారణమేదో గాదు. విమూఢాత్ముడయి కూచున్నాడు వాడు. ఆత్మ అంటే అంతఃకరణ మన్నారు భాష్యకారులు. వాడి అంతఃకరణం లేదా మనస్సనేది చక్కగా పనిచేయటం లేదు. విమూఢమయి పోయింది. మొద్దుబారి మొండిగా తయారయింది. దాని మార్గంలో తాను పోవలసిందే గాని తన మార్గానికి రాదది. అలాటి మనస్సుకు జవాబు చెప్పలేక ఇక ఏ ఇంద్రియాల నరికట్టినా ఏమి ప్రయోజనం. మన ఏవ మనుష్యాణా మన్నట్టు మనస్సు వల్లనే గదా జీవిత లక్ష్యాన్ని సాధించవలసింది. అదే తన మాట విననప్పుడిక తానేది

Page 217

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు