#


Index

కర్మ యోగము భగవద్గీత

  ఇంత చెప్పినా అర్ధం చేసుకోక కర్మేంద్రియాణి సంయమ్య. ఎవడైతే కర్మేంద్రియాలైన వాక్పాణి పాదాదులను మాత్రం బలవంతంగా అరికట్టి ఆస్తే - ఊరక కూచున్నానని భావిస్తాడో. అలా భావిస్తున్నాడే గాని వాడు నిజంగా ఊరక కూచోలేదు. కేవలం నోటితో మాటాడటం లేదు. కాలూ చేయి కదపటం లేదు. అంతమాత్రమే. కాని మనసు మాత్రం పరుగెడుతూనే ఉంటుంది. కారణం కర్మేంద్రియాల నరికట్టగలిగాడే గాని వాడు జ్ఞానేంద్రియాలను కట్టేయలేదు. చక్షురాదులైన జ్ఞానేంద్రియాలు అలాగే పనిచేస్తున్నాయి. ఒకవేళ వాటిని కూడా నిగ్రహించా డనుకొందాము. అప్పటికీ అంతరింద్రియమైన మనస్సునేమీ చేయలేడు. అది జ్ఞానేంద్రియా లన్నింటికీ అధిపతి. అది చెప్పిన మాట వినదు.

  వినక ఏమి చేస్తుందది. చెప్పాము గదా పరుగెడుతుందని. మనసా స్మరన్. మనసులో ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాడప్పుడు కూడా మానవుడు. జరిగిపోయినదీ జ్ఞాపకం చేసుకొంటుంటాడు. జరగబోయేవీ ప్రణాళికలు వేస్తుంటాడు. సరే జరుగుతున్న విప్పుడు చెప్పనే అక్కరలేదు. వీటికే ఇంద్రియార్ధాలని పేరు. ఇంద్రియాలకు విషయాలే ఇంద్రియార్థాలు. కంటికి రూపం చెవికి శబ్దం నాలుకకు రుచి ఇలాంటివి శబ్ద స్పర్శ రూపరసంధా లంటారు శాస్త్రజ్ఞులు. వీటినే స్మరిస్తుంటా డెప్పుడూ మనస్సుతో. వీటన్నిటికీ అధిష్ఠానమైన ఆత్మను గాదు స్మరించటం. దానికి మారుగా అనాత్మ ప్రపంచాన్ని.

Page 216

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు