#


Index

కర్మ యోగము భగవద్గీత

లయం చేసుకొంటూ పోతాడు. జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా తని తరువాత భగవద్గీతే చెప్పబోతున్నది. జ్ఞానమనేది ఒక అఖండ ప్రకాశం. కర్మ దానికొక చీకటిలాంటిది. చీకటి కమ్ముకొని వస్తుంటే వెలుగుదాన్ని ఎలా కబళిస్తుందో అలాగే కబళిస్తుంది జ్ఞానం కర్మను. దీనికే ప్రవిలాపనమని పేరు. చీకటి వెలుగులోకి వచ్చి వెలుగుగా మారినట్టే కర్మ కూడా జ్ఞానంలోకి వచ్చి జ్ఞానంగానే అనుభవానికి వస్తుంది జ్ఞానికి. ఇది ముందు ముందు బాగా వివరిస్తుంది గీత. ఇంతకూ భగవత్పాదు లుద్దేశించిన ధర్మ సూక్ష్మమిది.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే || 6 ||

  కాగా ప్రతి ఒక్కడూ ఇలా జ్ఞాని భూమిక నందుకోలేడు కాబట్టి అలాటివాడు జ్ఞానోదయ మయ్యేవరకూ కర్మానుష్ఠానం గాక కర్మయోగం పాటిస్తూ పోవటం చాలా మంచిది. అది కూడా పాటించకుండా పోరాదు. అసలు కర్మే చేయనని భీష్మించుకోరాదు. అలా భీష్మించుకొన్నా ప్రయోజనం లేదు. బలవంతంగా నీచేత చేయిస్తాయి ప్రకృతి గుణాలని ఇంతకుముందే పేర్కొన్నాడు. ఎలాగూ చేయవలసి వచ్చినప్పుడది కావాలిది కావాలని ఐహికాముష్మిక ఫలాల కోసం వెంపర లాడటం దేనికి. అందుకోస మాయా కర్మలు చేయలేక సతమతమై పోవటం దేనికి. జ్ఞానోపకారకమైన కర్మ యోగాన్నే ఆచరిస్తూ తత్ఫలితంగా ఆత్మజ్ఞానమే ఆర్జించి సార్ధకం చేసుకోవచ్చు గదా జీవితం.

Page 215

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు