కర్మ యోగము
భగవద్గీత
ఆచరించినా అది మిధ్యాచారం గాక సదాచార మెలా కాగలదు. సత్పదార్ధం మీద లక్ష్యం లేదు గదా ఆ మనస్సుకు. దాని లక్ష్యమంతా అసద్రూపమైన నామరూప ప్రపంచమే. అలాంటప్పుడది కర్మయోగమెలా అవుతుంది. కర్మయోగానికే నోచుకోకపోతే అది జ్ఞానయోగాని కెలా తోడ్పడుతుంది.
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున |
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే || 7 ||
అంచేత అది గాదు పధకం. మనస్సును విచ్చల విడిగా వదిలేసి బాహ్యమైన కర్మేంద్రియాలను మాత్రం తాత్కాలికంగా అరికట్టి కూచోటం కాదు. అది ఏమంత అసాధ్యం. ఎవడైనా చేయవచ్చు. ఎంతసేపైనా చేయవచ్చు. దానివల్ల వీసమెత్తు ప్రయోజనం లేదు జీవితానికి. జీవిత ప్రయోజనమే నీ వాసించే ట్టయితే ఇంద్రియాల నరికట్టట మెలాగా అని కాదు ఆలోచించ వలసింది. ఎప్పుడూ అదీ ఇదీ ఆలోచిస్తూ నీ ప్రాణం తీసే మనస్సు నరికట్టు చేతనైతే.
య స్త్వింద్రియాణి మనసా నియమ్య. మనసు నరికడితే చాలు. ఇంద్రియాలు వాటి పాటికవే కట్టుపడతాయి. మనసే గదా ఇంద్రియాల కధిపతి అని చెప్పాము. జ్ఞానేంద్రియాలకే గాదు. కర్మేంద్రియాలకు కూడా. అది సంకల్పిస్తేనే కన్ను చూస్తుంది చెవి వింటుంది. నోరు మాటాడుతుంది. కాలూ చేయీ ఆడుతుంది. మనసులో ఒకటి చేయాలనే ఇచ్ఛ లేకపోతే ఏ ఇంద్రియామూ ఏ పనీ పెట్టుకోలేదు. మనసు జారీచేసే ఉత్తరువును
Page 218