#


Index

కర్మ యోగము భగవద్గీత

బట్టే నడుచుకొంటాయి. జ్ఞానేంద్రియాలైనా కర్మేంద్రియాలైనా ఏదైనా. కాబట్టి అన్ని ఇంద్రియ వ్యాపారాలకూ మూలం మనోవ్యాపారం.

  అలాంటి కీలక స్థానమైన మనసు నీ అధీనంలోకి తెచ్చుకో మొదట. తెచ్చుకొంటే ఆ మనసు కధీనమై మెలగుతాయి ఇంద్రియాలన్నీ. ముందు జ్ఞానేంద్రియాలైన త్వక్చక్షుః శ్రోత్రాదులను అదుపులో పెట్టుకొన్న మనసు ఇక కర్మేంద్రియాలతో ఏ పనిచేసినా చేయవచ్చు. వాటిని ప్రత్యేకంగా నిగ్రహించుకో నక్కరలేదు. మనసు నిగృహీతమైతే చాలు. అవి నిగ్రహింప బడ్డట్టే. కాబట్టి వాటి నరికట్టే ప్రయత్నం మాని వాటి ద్వారా చేయవలసిన కర్మలన్నీ చేయటమే మంచిది. ఏమిటా కర్మ. మామూలు కర్మగాదు. కర్మయోగం. మామూలు కర్మ అయితే ఇంత పెద్ద మనోనిగ్రహ మక్కరలేదు. కర్మయోగానికే కావాలి ఆ శిక్షణ.

  ఎలాంటిదా కర్మయోగం. అసక్త స్స విశిష్యతే - సక్తం కాకుండా చేసే కర్మ. ఫలం మీద ఆసక్తే సక్తి. అది లేకుండా చేస్తే అది అనాసక్తమైన కర్మయోగ మవుతుంది. దానివల్ల అహంకార మమకారాలు నశించి సత్త్వం శుద్ధి అవుతుంది సాధకుడికి. దానితో వాడు జ్ఞానోత్పత్తికి నోచుకొంటాడు. కాబట్టి విశిష్యతే అంటున్నది గీత. మనోనిగ్రహం లేక కేవలం వాగాదీంద్రియాలు కదలకుండా పట్టుకొని చేయవలసిన కర్మలు కూడా ఎగగొట్టి తిరగటం కన్నా మనసు నదుపులో ఉంచుకొని తద్వారా కర్మేంద్రియాలతో నిష్కామంగా నీవు కర్మయోగ మాచరించటమే ఎన్నో రెట్లు విశేషం. అది ప్రాపంచికానికీ పారమార్థికానికీ రెంటికీ తప్పినదైతే

Page 219

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు