#


Index

కర్మ యోగము

మరొక పక్క కర్మణ్యేవాధికారస్తే అంటాడేమిటా ఈ కృష్ణ పరమాత్మ రెండు మాటలు మాటాడుతాడని. ఆయన మాటలు బాగా వివేచన చేసి చూచినా ఈ భ్రాంతి ఏర్పడేదిగా దసలు. అవరం కర్మ బుద్ధి యోగాత్తంటే సమత్వ బుద్ధి యుక్తమైన కర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కర్మ నికృష్టమైన దని వ్యాఖ్యానించారు భాష్యకారులు. అది కృపణాః ఫలహేతవః అనే మాటలో స్పష్టంగానే మనకు తెలిసిపోతున్నది. అంతేగాదు. కర్మణ్యే వాధికారస్తే కర్మలోనే అధికారం నీకు అదే చేస్తుండమని అర్జునుడి కాయన బోధించాడంటే అది కూడా మామూలు కర్మానుష్ఠానం కాదు. కర్మయోగం. మా ఫలేషు కదాచన అనే తరువాతి మాటలో మనకది కూడా తేటపడు తున్నది.

  ఇంతకూ ఏమిటి సారాంశం. కర్మ అనేది రెండు విధాలు. మామూలు కర్మానుష్ఠాన మొకటి. ఫల నిరపేక్షంగా చేసేదొకటి. మొదటిది అనుష్ఠానం. రెండవది యోగం. అనుష్ఠానంలో అహం మమ లుండి తీరుతాయి. యోగంలో అవి రెండూ ఉండవు. ఉంటాయి గనుక అది ఎంత శాస్త్రవిహితమైనా జ్ఞానానికి తోడ్పడదు. ఉండవు గనుకనే ఇది దానికి ఉపయోగ పడుతుంది. అలా ఉపయోగ పడుతుందనే అభిప్రాయంతోనే కర్మయోగం లోనే నీకధికార మదే చేస్తూపో. తప్పకుండా నీకది ఆత్మజ్ఞాన మందిస్తుంది. అలా కాక కేవలం శాస్త్రం చెప్పిందనే చేశావో అది యోగం కాదు. యోగం కాకుంటే అది నీకుపయోగ పడక పోగా సంసార బంధానికే

Page 209

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు