ఇలా ఎన్నైనా ఉండవచ్చు. అవి కాదు మాకు కావలసింది. జ్ఞానానికి పనికి వచ్చే కర్మ. అదే కర్మయోగం.
యోగమంటే కలయిక అని అసలైన అర్ధం. ఇదీ యోగ మదీ యోగ మన్నారంటే రెండూ పరస్పర విరుద్దం కావు. రెండూ కలిసి ఏకమే నని పరమాత్మ ఆశయం. కనుకనే ద్వివిధా నిష్ఠా రెండు నిష్ఠ లని ద్వివచనంలో చెప్పటం లేదు. నిష్ఠా అని ఏకవచనంలోనే పేర్కొంటున్నాడు. మరి ద్వివిధా ఏమిటి. అదే రెండు శాఖలుగా విభక్తమయి కనిపిస్తున్నది. ఒకటి ఉపాయమైతే మరొకటి ఉపేయం Means and end. కర్మనిష్ఠాయాః జ్ఞాన నిష్ఠా ప్రాప్తి హేతుత్వేన పురుషార్ధ హేతుత్వం న స్వాతంత్రేణ అంటారు భగవత్పాదులు. ఇందులో కర్మనిష్ఠ జ్ఞాన నిష్ఠకుపాయం. సత్వశుద్ధి ద్వారా అది జ్ఞానోత్పత్తికి తోడ్పడుతుంది. కనుక అది స్వతంత్రంగా తన పాటికి తాను మోక్షమనే ఫలాన్ని మన కందివ్వలేదు. పోతే జ్ఞానమలా కాక అది ఎప్పుడు దయించిందో అప్పుడిక దానికే ప్రతిబంధకం లేదు కాబట్టి తన పాటికి తాను స్వతంత్రంగానే మోక్షఫలాన్ని ప్రసాదించగలదు. ఇదీ వీటికున్న ఆంతరంగిక సంబంధం.
ఇప్పుడీ ఆంతర్య మర్ధం చేసుకోలేక పోయా డర్జునుడు. అర్జునుడే గాదు మనబోటి వారు కూడా చాలమంది ఇక్కడ పొరబాటు పడుతుంటారు. పడి మన పొరబాటు భగవద్గీత కారోపిస్తుంటాము అదే ఇప్పు డర్జునుడి మాటల్లో వ్యక్త మవుతున్నది. దూరేణ హ్యవరం కర్మ అంటాడొక పక్క
Page 208