అయితే ఏమిటీ మాట. ఎందుకు చెప్పినట్టిది గీత. భగవద్గీత వంటి శాస్త్రగ్రంధమిలా పరస్పర విరుద్ధమైన భావం లోకులకు బోధించట మేమి బాగు. పగలు రాత్రి అనే శబ్దాల కిక్కడ అహో రాత్రా అని వాచ్యార్ధం కాకుండా జ్ఞానమూ అజ్ఞానమని లక్ష్యార్థం Metaphorical చెప్పుకొంటే సరిపోతుందని దీనికి పరిహారం చెబుతారు కొందరు. కాని అది కూడా చెల్లే వ్యవహారం కాదు. ఎందుకంటే ఒకరికి పగలైనది ఒకరికి రాత్రి అన్నప్పుడు రాత్రి పగలనే రెండు భావాలూ ఇద్దరికీ ఉన్నట్టు చెబుతున్నది గీత. అప్పటికి ఇద్దరికీ జ్ఞానా జ్ఞానాలు రెండూ వర్తించవలసి ఉంటుంది. అలాంటప్పుడిక లౌకికుడి కంటే జ్ఞానికి విశేషమేముంది. ఓడిందెవడంటే గెలిచిందెవడని పండిత పామరు లిద్దరూ సమానమయి కూచున్నారు.
కాబట్టి అహో రాత్రాలనే మాటలకిక్కడ చెప్పవలసిన అర్ధం జ్ఞాన మజ్ఞాన మని కాదు. మరేమిటి. రాత్రి అంటే పరమాత్మ తత్త్వ మన్నారు భగవత్పాదులు. రాత్రి లాగా అంతా మన కగమ్య గోచరం కాబట్టి పరమాత్మను రాత్రితో పోల్చటం జరిగింది. లోకులందరికీ ఇలా రాత్రిలాగా పరమాత్మ అంతుపట్టకపోయినా మహాజ్ఞానికి మాత్ర మాతత్త్వం పట్టపగలు లాగా ఎక్కడబడితే అక్కడ దర్శన మిస్తుంటుంది. ఇది ఎలాంటిదంటే ఒక గుడ్లగూబే ఉంది. దానికి పగటివేళ కండ్లు కనిపించవు. మనందరికీ ఎంతో
Page 193