#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

  స్పష్టంగా ప్రతి ఒక్కటీ కనిపిస్తున్నప్పుడే అది ఏ ఒక్కటీ చూడలేని దుర్దశలో ఉంటుంది. మనకు పగలైతే దానికదే రాత్రి.

  అలాగే ఒక స్థితప్రజ్ఞుడి కెంతో స్పష్టంగా సూర్యరశ్మిలో మాదిరి కనిపించే ఆ బ్రహ్మ చైతన్యం - గుడ్ల గూబలలాంటి మందదృష్టిగల లోకులకే మాత్రమూ గోచరించటం లేదు. గుడ్లగూబకు సౌర తేజస్సే తమస్సులాగా భాసించినట్టు మనందరికీ ఆ బ్రహ్మ చైతన్య ప్రకాశమే అచేతనమైన జగత్తయి కూచుంది.

  పోతే ఇక మన మందరమూ పగలని ఏది చూస్తామో అది బ్రహ్మవేత్తకు రాత్రి అట. దీని కేమి టరం. పగలంటే ఇక్కడ నిజంగా పగలు కాదు పగలని మనం భ్రమ పడుతున్నది. అది ఏదో గాదు. ఈనామ రూపాత్మకమైన ప్రపంచం. ఇది మన చుట్టూ పరుచుకొని కనిపిస్తుంటే నిజంగానే ఇది ఒకటుందని చూస్తూంటాము. అది కనిపిస్తూ మనం దాన్ని చూస్తూ ఉంటాము. కాబట్టి పగలనే మన నమ్మకం. వాస్తవంలో ఇది పగలుగాదు రాత్రి అంటే మనమున్నాయని చూచే చరాచర పదార్ధాలు నిజంగా లేవక్కడ. లేని ప్రపంచాన్నే మన అజ్ఞానం వల్ల ఉన్నట్టు దర్శిస్తున్నాము. దానితో వ్యవహరిస్తున్నాము.

  ఇది ఎలాంటిదంటే ఒక స్వప్న దృక్కు అనుభవం వంటిదని సెలవిస్తారు భాష్యకారులు. స్వప్నంలో మనమెన్నో చిత్ర విచిత్రమైన దృశ్యాలు

Page 194

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు