సాంఖ్య యోగము
భగవద్గీత
చూస్తుంటాము. ఎంతమందితోనో వ్యవహరిస్తుంటాము. అదంతా తాత్కాలికంగా పగలనే మనభావన. అంత మాత్రాన అది యధార్ధమైన పగలు కాదు గదా. రాత్రి కాలాన్నే పగలుగా భ్రమపడి చూస్తుంటాడు స్వప్న దృక్కు వాడిలా చూస్తున్నా ప్రక్కనే మేలుకొని పనులు చేసుకొనే వేరొకడి కది రాత్రి కాలమే. పగలు కాదు. ఇక్కడ కలగనే వాడికి రాత్ర పగలైనా మేలుకొన్న వాడికది ఎలా రాత్రి కాలమో ప్రపంచమని చూస్తున్నది జ్ఞానికదంతా బ్రహ్మమే. అలాగే అజ్ఞాని
దీనిని బట్టి తేలిందేమంటే జ్ఞానికి బ్రహ్మమూ బ్రహ్మమే. ప్రపంచమూ బ్రహ్మమే. అజ్ఞానికి బ్రహ్మమూ ప్రపంచమే. ప్రపంచమూ ప్రపంచమే. అంటే జ్ఞాని కహోరాత్రాలూ బ్రహ్మమే కనిపిస్తుంటే అజ్ఞానికి ప్రపంచమే గోచరిస్తుంటుంది. వాడి కంతా బ్రహ్మమే. వీడికంతా ప్రపంచమే. ప్రపంచం కూడా వాడికి బ్రహ్మమే. బ్రహ్మం కూడా వీడికి ప్రపంచమే. బ్రహ్మ దృస్టితోనే బ్రతుకుతుంటాడు కాబట్టి ఎప్పుడూ జ్ఞాని జీవన్ముక్తుడైతే ప్రపంచదృష్టి ఎప్పుడూ వదలిపోదు కాబట్టి అజ్ఞాని జీవన్మృతుడు.
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ |
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ || 70 ||
Page 195