పరిశుద్ధమైతే అప్పుడిక మనసు ధ్యానించినా పరవాలేదు. ఇంద్రియాలు విషయాల మీదికి ప్రసరించినా ఇబ్బంది లేదు. ఎంచేతనంటే ఆత్మవశ్యైః అవి నీకు వశమై ఉంటాయి. నిన్ను మించి పోవు. విధేయాత్మా అంతేకాదు - ఆత్మ కూడా నీకు విధేయమై మెలగుతుంది. ఆత్మ అంటే మనస్సని వ్రాస్తున్నారు భాష్యకారులు. అది నీవెలా నడిపితే అలా నడుచుకొంటుంది. అంటే ఏమని అర్ధం. నీవీ విషయాలను గురించి ఆలోచించినా ఆ రూపంలో నీ ఆత్మే పరుచుకొని ఉన్నదని దర్శిస్తుంటావు. అదే ఈ శబ్దాది రూపాల్లో దర్శన మిస్తున్నట్టు ఎప్పుడు భావించావో అప్పుడిక విశేషాకారంగా కనిపించవవి. దేనిమీదా రాగం లేదు. దేనిపైనా ద్వేషం లేదు. అన్నీ నీకు సమానంగా భాసిస్తాయి.
అలా భాసిస్తే చాలు. ప్రసాద మధి గచ్ఛతి - ప్రసాదమంటే నిర్మలత్వం. స్వస్థత. అలాంటి స్తిమితతా నిర్లిప్తతా అధిగచ్ఛతి అందుకొంటుంది నీ అంతఃకరణం. ఇక్కడికి నాలుగవ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చింది. ప్రజేత కిమ్మని గదా ఆ ప్రశ్న. ఏది పొందుతాడీ స్థిత ప్రజ్ఞుడని అడిగాడు అర్జునుడు. అధిగచ్ఛతి అనేది దానికి జవాబు. అధిగచ్ఛతి అంటే పొందుతాడనే అర్ధం. ఏమిటా పొందేదంటే ప్రసాదం. నైర్మల్యం. రాగద్వేషాలు Likes and Dislikes రెండూ లేవు కాబట్టి ఉదాసీనంగా మారిపోతుంది మానవుడి మనస్సు. ఉదాసీనమే ఆత్మ స్వరూపం కనుక మనసప్పుడు మనసు కాదు. ఆత్మేనని భావం.
Page 183