సాంఖ్య యోగము
భగవద్గీత
ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే || 65 ||
ఇంతకూ ప్రసాదమనే గుణం మనసు కెప్పుడేర్పడుతుందో అప్పుడిక చెప్పనక్కర లేదు. సర్వదుఃఖానాం హాని రస్యోప జాయతే. అలాంటి జ్ఞానికిక ఏ దుఃఖమూ ప్రాప్తించదు. అన్ని దుఃఖాలూ అక్కడికి సమసిపోవలసిందే. ఆధ్యాత్మికాది తాపాలే గదా దుఃఖాలంటే. అవి ఏవీ వాడిమీద దాడి చేయవు. ఏమి కారణం. ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవ తిష్ఠతే. వాడి అంతఃకరణం ప్రసన్నమయి ఉంటుంది. అంటే స్వస్థత చెంది ఉంటుంది. స్వస్థత లేకపోవటానికి కారణం రజస్తమో మాలిన్యమే. దానివల్లనే ఆవరణ విక్షేపాలనే దోషాలు మనసు కేర్పడుతుంటాయి. అవి ఈ జ్ఞానికి పూర్తిగా క్షాళితమై పోయాయి కాబట్టి బుద్ధిః పర్యవ తిష్ఠతే ఆకాశంలాగా వాడి బుద్ధి అంతటా నిండిపోయి నిలకడ కలిగి ఉంటుంది. నిలకడ చెందిన బుద్ధి ఆత్మస్వరూపమే నంటారు భగవత్పాదులు.
బుద్ధి బుద్ధేగదా అది ఆత్మ ఎలా అవుతుందని చాలామంది కిక్కడ సందేహం. బుద్ధికీ ఆత్మకూ వస్తుతః భేదం లేదు. బుద్ధి జ్ఞానస్వరూపమే ఆత్మా జ్ఞాన స్వరూపమే. అయితే తేడా ఎంతవరకంటే బుద్ధిలో జ్ఞానం వృత్తిరూపంగా మారుతుంటుంది. అవి తరువాత వాసనలను సృష్టిస్తాయి. ఆ వాసనలు పొరలు పొరలుగా పేరుకు పోతుంటాయి బుద్ధిలో. వాసనలు పోవాలంటే బుద్ధి మొదట వృత్తిరూపంగా మారకూడదు. వృత్తులుగా
Page 184