చేసి ఎక్కడో అడవిలో పారేసినట్టు పారేస్తాయీ ఇంద్రియాలనే దుండగీండ్రు మనస్సనే అధికారి నీ సంసారమనే అరణ్యంలో.
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 61 ||
కాబట్టి ఇంద్రియాలింత చెడ్డవి. ఎంత దారుణానికైనా తెగిస్తాయి. వాటి కా బల మిచ్చింది ఇంద్రియార్థాలే. శబ్ద స్పర్శాదులు. మాత్రా స్పర్శలని ఇంతకు పూర్వమే వర్ణించిందిగా గీత. వాటితో ప్రతిక్షణమూ లావాదేవీ పెట్టుకొంటూ పోతే ఏమవుతుంది. అదను చూచి విరుచుకు పడతాయి. బలవంతంగా మానవుణ్ణి తమకు బానిసను చేసుకొంటాయి. అంచేత అవి మనమీద దాడి చేయకముందే హుషారు పడాలి మనం.
ఎలాగ. తాని సర్వాణి సంయమ్య. వాటి పోకడ కనిపెట్టి ముందుగానే అదుపులో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే యుక్తః - ఏకాగ్రత ఉండాలి నీకు. ఒక దానిమీద లక్ష్యముంటే గాని మిగతా వాటిని నిర్లక్ష్యంగా చూడలేవు. అలా నిర్లక్ష్య దృష్టితో చూస్తేగాని అవి నీకు వశం కావు. ఆ సీత మత్పరః అహం వాసుదేవః సర్వ ప్రత్యగాత్మా - పరోయస్య స మత్పరః - మత్పరః అనే దాని కర్ధం వ్రాస్తున్నారు గురువుగారు. వసతి దీవ్యతీ తి వాసుదేవః అస్తి భాతి. సచ్చిద్రూపంగా సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ స్వరూపుడే పరాయణం నాకు. న అన్యోహం తస్మాత్ దానికన్నా
Page 177