#


Index

సాంఖ్య యోగము

వెనక్కు మళ్లించాలి. అది ఎలాగని అడిగితే కూర్మోంగానీవ అని గీతోపదేశం. కూర్మమంటే తాబేలు. దానికి రెండు లక్షణాలున్నాయి. తన పాదాలూ తలా బయటికి చాపగలదు. ఏదైనా అలికిడి అయితే మరలా లోపలికి తీసుకొని ముడుచుకొని పోగలదు. అప్పుడు దానికే ఉపద్రవమూ లేదు.

  అలాగే ఒక జ్ఞాని కూడా తన ఇంద్రియాలను విషయాల మీదినుంచి వెనక్కు మళ్లించుకోగలిగి ఉండాలి. ముందుకూ పోవచ్చు ఇంద్రియాలు వెనక్కూ రావచ్చు. ముందుకైతే ప్రవృత్తి. వెనక్కైతే నివృత్తి. విషయ ప్రవృత్తి ఎప్పటికైనా ప్రమాదం. అందులో నుంచి నివృత్తి నవలంబిస్తేనే ఎలాటి ప్రమాదమూ ఉండబోదు. ప్రవృత్తి చలనం. అదే మాట. మాట కూడా చలనమే గదా. మనసులో ఆలోచనా చలనమే- నోట వచ్చే మాట చలనమే. ఇంద్రియ వ్యాపారాలూ చలనమే. చలనమే మాట అన్నప్పుడు అది ఆగిపోవట మచలత్వం అదే మౌనం. అనాత్మ ప్రత్యయ తిరస్కారస్య పర్యవసానం మౌనమని బృహదారణ్యక భాష్యంలో సెలవిచ్చారాచార్యుల వారు. అనాత్మ భావ మిసుమంత కూడా కనపడక అంతా ఆత్మగా దర్శన మివ్వాలట. అదే మౌనమనే దాని కర్ధం.

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే || 59 ||

Page 172

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు