#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

వ్రాశారు వ్యాసభగవానులు. ఒకరు వాణ్ణి గురించి మాటాడితే అది ఉచ్యతే వాడే వాణ్ణి గురించి అయితే మాటాడటమంటూ లేదు - మౌనమేనని మహర్షి ఆశయం. మాటాడక పోవటం వాచికమే గాదు. శారీరకం కూడానని వర్ణిస్తున్నాడిప్పుడు. యదా సంహరతే చాయమ్ నివృత్తి తప్ప ప్రవృత్తి లేదు జ్ఞానికి. ప్రవృత్తి ఉంటేనే మాట. నివృత్తిలో మాటే ముంది. మౌనమే. ఎలాంటిదా నివృత్తి. ఇంద్రియాణీం ద్రియార్థేభ్యః తన ఇంద్రియాలను వాటి విషయాలనుంచి ఉపసంహరతే వెనక్కు తీసుకొంటాడట.

  ఇంద్రియాలంటే కన్నూ ముక్కూ చెవీ ఇలాంటి జ్ఞానేంద్రియాలూ కరచరణాదులైన కర్మేంద్రియాలే గాక అంతరింద్రియమైన మనస్సు కూడా. వీటన్నిటికీ ఒక్కొక్క దాని కొక్కొక్క అర్ధమని ఉంటుంది. కంటికి రూపం చెవికి శబ్దం - మనస్సు కాయా విషయాలను గూర్చిన ఆలోచనలూ ఇలాగ వీటికే విషయాలని Objects కూడా నామాంతరం. ప్రతిక్షణమూ ఈ ఇంద్రియార్థాలు మన ఇంద్రియాల నటూ ఇటూ లాగుతూనే ఉంటాయి. విరామమనేది ఎరగడు మానవుడు.

  అలా నిర్విరామంగా వీటి వ్యవహారం సాగుతుంటే వాడి ప్రజ్ఞ ఎప్పుడూ స్థిరంగా నిలబడదు. గత ప్రజ్ఞుడే గాని స్థిత ప్రజ్ఞు డనిపించుకోలేడు. అలా అనిపించుకోవాలంటే వాటి నాయా విషయాల మీదికి పరుగెత్తకుండా

Page 171

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు