అధిష్ఠాన మెప్పుడూ సమమే. దానిమీద ఆరోపిత మైనదే విషమం. బంగారం సమంగానే వ్యాపించి ఉంది ఆభరణాలలో. ఆభరణాలే దేనికది వేరుగా కనిపిస్తాయి. అలాగే సువర్ణం లాంటి ఆత్మనే అన్ని పరిస్థితులలో గట్టిగా పట్టుకొన్నాడో అప్పుడిక తేడా లేదు. ఏదీ విలువ తక్కువదీ గాదు. ఎక్కువదీ గాదు. అన్నీ విలువైనవే. కారణం పరిస్థితులను కాదు వాడు చూడటం. తద్రూపంగా దర్శనమిచ్చే ఆత్మ తత్త్వాన్ని. అదే ఒక రోడ్డు రోలరులాగా అన్ని వైషమ్యాలనూ చదును చేసి ఏకంగా చూపుతుంది.
ఇప్పుడీ శ్లోకంలో రెండవ ప్రశ్నకు కూడా సమాధాన మిచ్చినట్టయింది. ఇదీ దీని తరువాతిదీ ఆ తరువాతదీ కూడా దీనిదే సమాధానం. ఏమిటిది. స్థితధీః కిమ్ ప్రభాషేత - స్థిత ప్రజ్ఞుడైన వాడు స్వయంగా ఏమి జరిగినా అభినందించడు. ద్వేషించడు. అదీ వాడి మాట. తేడా చూస్తే మాట. చూడకుంటే మాటేముంది. మనమే మాట. మాట మౌనంలో కలిసిపోయింది. హానోపాదానాలకు స్వస్తి చెప్పి ఏది జరిగినా అలా భాసిస్తున్నదని చూడటమే మౌనం. ఆత్మ మౌనం గదా. అందుకని చూపు కూడా మౌనమే.
యదా సంహరతే చాయం కూర్మోఽంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || 58 ||
అందుకే మొదటి రెండు శ్లోకాల్లో ఉచ్యతే ఉచ్యతే అని క్రియా పదం వాడి ఆ తరువాత వచ్చిన శ్లోకాల్లో ఆ పదం లేకుండా మామూలుగా
Page 170