#


Index

సాంఖ్య యోగము

అనామయం. ఆ మయమంటే వ్యాధి అని అర్ధం. జనన మరణాదులైన ఉపద్రవాలే మానవుడికి పట్టుకొన్న ఏకైకమైన వ్యాధి. అది ఈ సమత్వబుద్ధి నవలబించిన కర్మయోగులకు క్రమంగా జ్ఞానోదయమై తత్ఫలితంగా ప్రాప్తిస్తుంది.

  తద్విష్ణోః పరమంపద మని కఠోపనిషత్తు చెప్పిన మాట ఇది. దానినే అనుసరించి చెబుతున్నాడీ మాట వేదవ్యాసుడు. విష్ణోః పదమనగానే అది ఏదో పదం ఎక్కడో వైకుంఠంలో ఉందని మరలా భ్రాంతిపడ రాదు మనం. ఏదో గాదది మోక్షమే నని నిష్కర్ష చేసి చెప్పారు భగవత్పాదులు.

  ఇక్కడ ఒక ధర్మసూక్ష్మం సెలవిస్తున్నారు కూడా ఆయన. బుద్ధి యోగా ద్ధనంజయ అనే చోట వ్యాసమహర్షి ప్రయోగించిన బుద్ధి యోగమనే మాట సమత్వబుద్ధి యోగమని ఇంతవరకూ మూడు శ్లోకాలలో మనం వ్యాఖ్యానించి చెప్పుకొన్నాము. సమత్వబుద్ధి కర్మయోగమే గదా. ఇంకా అది అప్పుడే జన్మబంధమెలా వదిలిస్తుందని శంకించి అది జ్ఞానయోగంగా మారి ఆ తరువాత మోక్షాన్ని ప్రసాదిస్తుందని వ్యాఖ్యానించ వలసి వచ్చింది మేము. అలా కాక బుద్ధి యోగమనే మాటకు జ్ఞానయోగమనే అర్థమే చెప్పుకొన్నా చెప్పుకోవచ్చు. అలాగైతే అది జ్ఞానమే గనుక సాక్షాత్తుగానే మోక్షదాయకం కాగలదు. కర్మయోగం జ్ఞానయోగంగా మారి అని డొంక తిరుగుడుగా చెప్పుకోనక్కర లేదప్పుడని ఇందులో సూక్ష్మం బయట పెట్టారాయన.

Page 156

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు