#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

ఫలం త్యక్త్వా కర్మ జన్యమైన ఫలాన్ని వదులుకొన్నప్పుడే. అది అనుకూలమే కావచ్చు. ప్రతికూలమే కావచ్చు. ఎలాటి ఫలితమది ఇచ్చినా దానికి తిలాంజలి ఇవ్వవలసిందే. అలాటి ఫలత్యాగముండి సమత్వబుద్ధి పనిచేసినవాడే తద్ద్వారా ఆత్మజ్ఞానానికి నోచుకొంటాడు. నోచుకొన్నాడంటే వాడిక కర్మిగాదు జ్ఞాని.

  మరి జ్ఞాని ఎప్పుడయ్యాడో జన్మబంధ వినిర్ముక్తాః ఇక వాడికి కర్మఫలమైన జన్మబంధం లేదు. జన్మైవ బంధః జన్మ బంధః అని అర్ధం చెప్పారు స్వామివారు. జన్మ ఎత్తటమే బంధం మానవుడికి. జన్మించటం వల్లనే ఉపాధి ఏర్పడింది. దానితో జీవిస్తుంటాము ప్రారబ్ధ మున్నంత కాలమూ. అది తీరిపోగానే దేహ పాతమయి కన్నుమూస్తున్నాము. కాబట్టి మరణం కాదు. అసలు జన్మే బంధం. ముందు జన్మిస్తే గదా తరువాత మరణిస్తాము. జన్మించ కనేపోతే మరణమనే ప్రశ్నేముంది. అంచేత జననమరణాలనే సంసార బంధం తప్పించుకొని బయటపడతాడు జ్ఞాని. జీవించి ఉండగానే ముక్తుడయి పోతాడంటారు భగవత్పాదులు.

  ఎవరు కర్మ యోగులా. కర్మయోగులే. కర్మయోగావస్థలో కాదు. వారు జ్ఞానయోగులుగా మారి ఆ తరువాత ముక్తి పొందుతారని అర్థం చేసుకోవాలి మనమిక్కడ. కనుకనే మనీషిణః అనే మాట ప్రయోగించాడు వ్యాసభట్టారకుడు. మనీషులయి పొందుతారట కర్మయోగులు. ఏమిటా పొందేది. పదం గచ్ఛం త్యనామయమ్. అనామయమైన పదం. పదమంటే స్థానం - స్థితి - దశ. అది అనామయమట. ఆమయం లేనిదేదో అది

Page 155

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు