#


Index

సాంఖ్య యోగము

  ఇంకొక రహస్యమేమంటే కర్మలోనే అర్జునుడికి ప్రవేశమిక దేనిలోనూ లేదనగానే మన ములిక్కి పడనక్కర లేదు. అర్జునుడంత కన్నా గాబరా పడనక్కర లేదు. కేవల కర్మానుష్ఠానం కాదు పరమాత్మ ఇక్కడ ఉద్దేశించింది. కర్మణా పితృలోకః దానివల్ల లోకాంతర ప్రాప్తే గాని జ్ఞాన ప్రాప్తి లేదు. పోతే అదే యోగంగా మారితే మాత్రం చాలా గొప్పది. అప్పుడది ఏదో పెద్దలందరూ చేశారు మనమూ చేస్తున్నామనే యాంత్రికమైన క్రియగాదు. ఆత్మజ్ఞానానికి ఎంతో దోహదం చేస్తుందా కర్మ. దీనికే అనుష్ఠానమనేది యాంత్రికం. అది జ్ఞానానికి తోడు పడదు. ఒక కర్మణా పితృలోకః దానివల్ల లోకాంతర ప్రాప్తేగాని జ్ఞానప్రాప్తి లేదు. పోతే అదే యోగంగా మారితే మాత్రం చాలా గొప్పది. అప్పుడది ఏదో పెద్దలందరూ చేశారు. మనమూ చేస్తున్నామనే యాంత్రికమైన క్రియగాదు. ఆత్మజ్ఞానానికి ఎంతో దోహదం చేస్తుందా కర్మ. దీనికే అనుష్ఠానమని గాక యోగమని పేరు పెట్టింది గీత.

  ఇది ఎలాంటిదంటే ఒక నదీ ప్రవాహముంది. దాని ఇష్టానుసారంగా వదిలేస్తే అది పోయి సముద్రంలో కలిసిపోతుంది. శుద్ధమైన నదీ జలం అశుద్ధమైన లవణరసంగా మారుతుంది. ఎవరికీ ఉపయోగపడదు. అలా కాక దానికి ఆనకట్టలు కట్టి కాలువలు తీర్చి పంటపొలాలకు పారించగలిగితే దేశం సస్యశ్యామలంగా మారుతుంది. నలుగురికీ

Page 147

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు