#


Index

సాంఖ్య యోగము

దీనితో మిగతా నాలుగు భూతాలతో పాటు ఆకాశమనే అయిదవ భూతం కూడా బలాదూరయి పోయింది.

అవ్యక్తోఽయమచింత్యోఽయమవికార్యోఽయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి || 25 ||

  ఇంతకూ పాంచ భౌతికం కాదాత్మ అనేది అభౌతికమని చెప్పినట్టయింది. అభౌతికమైతే అది అవ్యక్తః అవ్యక్తమైనది. నామరూపాత్మకమైతే అది వ్యక్తం Manifest. అలా కానిదైతే అవ్యక్తం. పృధి వ్యాది భూతాలు నాలుగూ నామరూపాత్మకాలు. వాయ్వాకాశాలు రెండూ రూపరహితమైనా వాయువు చలనాత్మకం గనుక వ్యక్తమే. ఆకాశం శబ్దాత్మకం గనుక అదీ వ్యక్తమే. అంతేగాక ఇది వాయువూ ఇది ఆకాశమని జ్ఞానం చేత గ్రహించ గలుగుతున్నాము. కనుక ఆ మేర కవి వ్యక్తమే. పోతే అలా ఏమాత్రమూ గ్రహించలేని దాత్మ. అదే అన్నింటినీ గ్రహిస్తుంద న్నప్పుడు దాన్ని ఏది గ్రహించాలి ఎలా గ్రహించాలి. కనుక అది ఒక్కటే అవ్యక్తం. నిరాకారం - నిరవయవ Formless indivisible మైన తత్త్వం. దీనితో సాకారమూ సావయవమూ అయిన స్థూల శరీరంతో దానికి సంబంధం లేదని తెలిసిపోయింది.

  పోతే అచింత్యః అది మనసుతో కూడా ఆలోచించేది కాదు. మనస్సు కతీతమైన పదార్ధం. ఎందుకని. ఆలోచించామంటే అది ఆలోచనకు విషయ Object మవుతుంది. విషయమైతే అది అనాత్మేగాని ఆత్మకాదు.

Page 102

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు