మయి సన్న్యస్య అని పదే పదే గుర్తు చేస్తుంది. అంతే కాదు. బ్రహ్మ క్షత్రాది వర్ణ విభాగం కూడా ఏ మానవుడూ సృష్టించింది కాదు. నేనే కల్పించానని ముందు చెప్పి సర్వసాక్షి నైన నేను మాత్రమెలా కల్పిస్తాను. అది వారి వారి స్వభావాన్నిబట్టి ఏర్పడిందేనని పేర్కొంటుంది భగవద్గీత. నిజమే గుణ కర్మలను బట్టి ఏ వైషమ్యమైనా సృష్టిలో. సమమైన దృష్టితో చూస్తే ఏ విభాగమూ లేదు. అందుకే సమదర్శనమే గొప్ప దర్శనమని కూడా చాటుతుంది గీత.
ఇలాటి విప్లవాత్మకమైన విశ్వజనీనమైన భావాలెన్నో ఉన్నాయి. భగవద్గీతలో. ఆఖరుకు మత్స్య కూర్మాద్యవతారా లెక్కడ ఉన్నాయి మనం చూడలేదు గదా అని హేతువాదు లీనాడు ప్రశ్నిస్తే అవి నమ్మినా నమ్మకపోయినా భగవ ద్విభూతి ఎక్కడ కొట్టవచ్చినట్టు కనిపిస్తే అదే భగవదవతార మనుకోమని ఎంతో నవీనమైన భావాన్ని కూడా మనకందిస్తుంది. య ద్య ద్విభూతి మత్సత్త్వం - తత్తదేవా వ గచ్ఛత్వం మమ తేజోంశ సంభవ మంటే అదే గదా అర్ధం. ఇదుగో ఈ సమన్వయ మార్గమే భగవద్గీత ప్రత్యేకత. అంతేకాదు. ఆధ్యాత్మికమే గాక ధార్మిక నైతిక సామాజిక శారీరక మానసిక దైవందిన జీవిత రంగాలలో ఏ రంగంలో మానవుడెలా జీవించాలో వాడి సుఖ జీవనానికేది ఆవశ్యకమో అదంతా పూస గుచ్చినట్టు బోధించి మానవజాతి సర్వతో ముఖాభివృద్ధికి తోడు పడటమింకా దానికున్న గొప్ప విశిష్టత.
Page 10