#


Index

ఉపోద్ఘాతము (ప్రధమ) భగవద్గీత

  మానవులలో దైవగుణ సంపన్నులెవరో ఆ సురరాక్షస గుణాలున్న వారెవరో వారి వారి ఆహార విహారా లెలాటివో ఎలాంటి దసలు ఆదర్శప్రాయమైన జీవితమో - అది ఎలా అలవరుచుకోవాలో - ప్రొద్దున లేచినప్పటి నుంచీ రాత్రి పడుకోబోయే వరకూ బ్రతికినంత కాలమూ ఏ లక్ష్యం కోసం బ్రతుకు సాగించాలో మానవ లోకానికి తెలియజేయటం కన్నా విలువ గల ప్రసంగమేముంది. అది భగవద్గీత సాధించినట్టు ఏ గ్రంధమూ సాధించ లేదంటే అతిశయోక్తి కాదు. యదిహాస్తి తదన్యత్ర అని మహాభారతానికి సామూహికంగా వచ్చిన కీర్తి అందులో ఏకదేశమైన ఒక్క భగవద్గీతకే అన్వయించినా అన్వయించుకోవచ్చు. మానవ విజ్ఞాన సర్వస్వమే. భగవద్గీత Encyclopedia of human knowledge.

  అది మనసులో ఉండే నేను నా యీ గ్రంధానికి భగవద్గీతా సర్వస్వమని పేరు పెట్టాను. ఇది నేను వ్రాయాలని వ్రాయలేదు. అసలా తలంపు కూడా లేదు నాకు. ఎందుకంటే నేను వ్రాసినవే చాలా ఉన్నాయిప్పటికి. తత్త్వ సాహిత్యమనీ - సాహిత్యతత్త్వమనీ పేరుపెట్టి పది పదిహేను గ్రంధాలు వేదాంత విజ్ఞానం జిజ్ఞాసు లోకాని కందివ్వాలని అప్పుడప్పుడు వ్రాసి ప్రకటించాను. కాని రచనా వ్యాసంగమే గాక ప్రవచన వ్యాసంగం కూడా ఉన్నవాణ్ణి నేను. ఆ సందర్భంగా ప్రస్థానత్రయం శాంకర భాష్యంతో మొదట హైదరాబాదులోనూ తరువాత విజయవాడలోనూ కొన్ని సంవత్సరాల నుంచీ సత్సంగ సభ్యులకు ప్రతి దినమూ దీక్షగా బోధ చేస్తూ వచ్చాను. అందులో గీతా ప్రవచనం హైదరాబాదులో 150 రోజులు

Page 11

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు