చేయి కలిపిన నేరానికవి తొలగిపోతే ఇదీ వాటితో పోవలసి వస్తున్నది. అవి లోకాంతరాలకు వెళ్ళుతుంటే తానూ వెళ్ళవలసి వస్తున్నది. అవి మరలా ఒక స్థూల శరీరంలో వచ్చి ప్రవేశిస్తే తాను ప్రవేశించ వలసి వస్తున్నది. కారణం వాటి ద్వారా తాను చేసుకొన్న పుణ్యపాపాది కర్మలే. ఒక కర్మచేశావంటే దానికి తగిన ప్రతిఫలం ఉండి తీరుతుంది. అది నేను చేశాను నా కోసమని చెప్పి దానిని జీవుడు అభిమానించాడు. కాబట్టి తప్పకుండా అది వీడి మెడకు చుట్టుకొంటుంది. అభిమానించిన నేరానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉపాధిలో చేరి దానినీ మనః ప్రాణాల ద్వారానే అనుభవించి తీరాలి. ఆ అనుభవించటానికి ఈ ఉపాధిలోకి రావడమే జీవుడి జన్మ. చేసిన కర్మలో ప్రారబ్ధం తీరే వరకు అనుభవిస్తూ కూచోటమే జీవనం. అది తీరటమే మరణం. అది తీరినా మరలా సంచిత కర్మ ఫలాన్ని అనుభవింటానికే లోకాంతర గమనం. దానిలో నుంచి మరలా ప్రారబ్ధమైన కర్మ ఫలాన్ని చవిచూడటానికే జన్మాంతరం. ఇలా ఒక విష వలయమిది జీవుడి పాలిటికి.
ఇలాటి జీవుణ్ణి మనస్సులో పెట్టుకుని చెప్పినప్పుడు కూడా జనన మరణాలు లేవు వాస్తవానికి. కర్మ చేయటానికి ఫల మనుభవించటానికి జీవుడుండ వలసిందే గదా. చేయటానికి శరీరంలో ప్రవేశిస్తాడు. అనుభవించటానికి కొంత కాలమందులో జీవిస్తాడు. అనుభవం తీరగానే మరలా ఒక అనుభవం కోసం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళుతాడు. కాబట్టి ప్రవేశించక ముందూ వెనుకా అతడు ఉండక తప్పదు. కాబట్టి జనన మరణా లతనికి చెప్పరాదు. అప్పటికి మనం చెప్పుకొనే జనన మరణాలు జీవుడివి గావు జీవుడి ఉపాధివి. అయినా ఉపాధితో తాదాత్మ్యం చెందిన
Page 95