#


Index

నవవిధ గణపతులు - ప్రతీక వాదం

  "గణానాంత్వా గణపతిగ్ ం హవామహే " అని ఋగ్వేద సూక్తి. గణాలన్నిటికి అధిపతి గణపతి. గణాలేమిటి. పంచభూతాలే గణం. పాంచ భౌతిక పదార్థాలు కూడా గణమే. వీటన్నిటినీ అదుపులో పెట్టుకొన్న దేవత గణపతి. విశ్వవ్యాపకమైన శక్తే దేవత అంటే. విశ్వ మీ భూత భౌతిక గణమే. కనుకనే జ్యేష్ఠ రాజమని కీర్తించిందా మంత్రం. అన్నిటికన్నా జ్యేష్ఠమూ అన్నిటికీ నియామకమూ అయిన మహాశక్తి కది తగిన మాటే. షాడ్గుణ్యంతో కూడినదే భగవత్తత్త్వం. అందులో బలమనేది ఒక గుణం. దాన్ని ప్రధానంగా తీసుకున్నది గాణపత్యమనే మతం. గణపతికి సంబంధించినది గాణపత్యం. గణపతి అప్పటికి బలానికి సంకేతమన్న మాట. బలమంటే మన మనుకునేది కాదు. స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ అని శ్వేతాశ్వతరం వర్ణించిన బలం. పరమాత్మ ఇచ్ఛా శక్తి అది. జ్ఞానానికీ క్రియకూ మధ్యవర్తిని. జ్ఞానం క్రియగా మారటమే సృష్టి. అలా మార్చే శక్తి బలం. కనుక చరాచర సృష్టికి మూల భూతమూ తన్నియామకమూ అయిన తత్త్వమే గణపతి. వాగీశాద్యా స్సు మనసః సర్వార్థానా ము పక్రమే యంనత్వా కృతకృత్యాఃస్యుః - ముక్కోటి దేవతలూ బ్రహ్మదేవుడితో సహా అయనకు నమస్కరిస్తున్నా రంటే ఏమిటి అర్ధం. పారమేశ్వరమైన ఇచ్ఛాశక్తే అన్ని శక్తులకూ అతీతమైనది గనుక అది దేవతలందరికీ పూజనీయం. సృష్టికే మూలభూతం గనుక సృష్టికర్తకు కూడా ఆరాధనీయం. దేవతలంటే శక్తి విశేషాలే గనుక ఆదిశక్తి అయిన గణపతి వారందరికీ ఆరాధ్యుడని చెప్పటంలో ఆశ్చర్యం లేదు.

Page 68