#


Index

  ఆదిశక్తి గనుకనే మిగతా శక్తులూ, వ్యక్తులూ అన్నీ ఆయన కధీనమై మెలగవలసిందే. అంటే ఏమన్న మాట. ఆయా దేవతలు, భూతాలు గణమని భావిస్తే ఈ గణాలకు నియామకమైన మహాశక్తే గణపతి అని అంతరార్థం,

  శక్తికన్నా బలమైనదే ముంది సృష్టిలో. శక్తి అంటేనే బలం. బలం వావ విజ్ఞా నాత్ భూయః :- అన్నది ఛాందోగ్యం. వాగాదులకంటే విజ్ఞానం గొప్పదైతే విజ్ఞానానికంటే మహత్తరమైనది బలమట. బలేనవై పృథివీ తిష్ఠతి బలే నాంతరిక్షం :- బలేన ద్యౌః :- బలేన పర్వతాః :- బలేన దేవ మనుష్యాః :- బలేన పశవః :- బలేన వయాంసి :- బలేన తృణ వనస్పతయః బలేన లోకః :- అని బలం తాలూకు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న దుపనిషత్తు. స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా ఒకానొక బలంతో ఇలా నిలిచి ఉందట. ఆ బలానికి సంకేతమైన గణపతి అప్పటికి విరాడ్రూపుడైన పరమాత్మే. అందుకే “శుక్లాంబరధరమ్ విష్ణుం” అని కీర్తించారా దేవతను. విష్ణ వ్యాప్తావని వ్యుత్పత్తి. విష్ణువంటే సర్వజగ ద్వ్యాపి అయిన భగవదైశ్వర్యమే. అదే గణపతి.

  సర్వవ్యాపి అన్నప్పుడీ బాహ్యజగత్తే కాదు. ఆంతర జగత్తు కూడా. బ్రహ్మాండమెలా వ్యాపించిందో అది పిండాండంలో కూడా ప్రతి అణువూ వ్యాపించి తీరాలి. అప్పటికి మన దే హేంద్రియ మనోబుద్ధ్యహంకారాలు కూడా అదే. భూత భౌతికాలు బాహ్యమైన గణమైతే దేహేంద్రియాలు ఆభ్యంతరమైన గణం. ఈ రెండింటి లోపల అన్నప్పుడది పరమాత్మ శక్తే. నిరాకారమైన ఆశక్తే సాకారమైతే విశ్వం. విశ్వరూపుడు గణపతి అయితే విశ్వమాయన రూపం. అయితే దాని నలాగే భావించాలి మనం.

Page 69