అది మానవులకు మూల పురుషుడైన మనువు జీవితంలోనే మనం చూడవచ్చు. మనువే కదా మనుజులందరికీ మార్గ దర్శకుడు. అంచేత మీరు అది అలవరుచుకొని జీవితాన్ని సఫలం చేసుకోండి అని కవి లోకానికిచ్చే సందేశం.
కనుక నాలుగు కథలు వర్ణించినట్టు కనిపించినా - నాలుగు కథలూ కావవి. నాలుగు పాత్రలూ లేరు. అంతా కలిసి ఒకే ఒక పాత్ర. అది మానవుడు. కథలన్నీ కలిసి ఒకే ఒక కథ. అది అతని జీవితం. నాలుగు భూమికలే గాని అవి నాలుగు జీవితాలు కావు. ధర్మార్ధ కామ మోక్షాలే ఆ భూమికలు. ఇందులో మొదటి మూడు చివరి దానిలో ఎలా పర్యవసానం చెందాలో అలా చూపటమే పెద్దన ఉద్దేశం. ఇలాంటి దృక్పధంతో మనం విమర్శించి చూస్తే వస్త్వెక్యమే కాదు. పాత్రైక్యం భావైక్యం కూడా కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది భావుకుడైన వాడి హృదయానికి. ఇదే అసలు ప్రబంధమంటే. ప్రకృష్టమైన బంధం. మహాభారతాది ఇతిహాసాలలో ఐతే చెల్లా చెదురుగా భాసిస్తాయి ఇవి. ఎక్కడ ఏదో వెతుక్కోవలసి వస్తుంది. అలా కాక సంక్షిప్తంగా రచించిన ఇలాంటి కావ్యాల్లో వెంట వెంటనే గోచరిస్తుం.. మన బుద్ధికి. కాబట్టి తన ఆదర్శాన్ని ఇంత అందంగా అద్భుతంగా చిత్రించి చూపటమే ప్రబంధ కవి ప్రాగల్భ్యం. అందుకే అన్నారు అల్లసాని వారి అల్లిక జిగి బిగి అని. బిగి వస్తు నిర్మాణంలో ఐతే ಜಿಗಿ దాన్ని సర్వాంగ సుందరంగా తీర్చటంలో. ఇవి రెండూ ఆ కాలానికి క్రొత్తగా సాధించిచూపాడు గనుక ఆయన ఎప్పటికీ ఆంధ్ర కవితా పితామహుడే
★★★
Page 67