అది ప్రపంచాభి ముఖమైతే ఇది పరమాత్మాభి ముఖం. దానికి ప్రపంచమే వేద్యం. దీనికి వేద్యం పరమాత్మ. అక్కడ విద్యకు భిన్నమైనది వేద్యం. ఇక్కడ అలా కాదు అభిన్నమైనది. విద్యా వేద్యం ఒక్కటే. ఈ వేద్యం దేశ కాల వస్తువులన్నింటిని వ్యాపించినది గనుక తదా కార వృత్తి అయిన విద్యతో దీన్ని గ్రహిస్తే చాలు. ఇక ఏ సాధనా అక్కర లేదు. దేశ కాలాదులన్నీ స్వరూపంగానే అనుభవానికి వస్తాయి కాబట్టి లోకాంతర జన్మాంతర దేహాంతర ప్రసక్తి లేదు. అది లేకుంటే ఇక సంసార గంధమే లేదు గనుక సకల బంధ నిర్ముక్తుడై మానవుడు బ్రహ్మ భావాన్ని అందుకోగలడు. ఇదే పరమ పురుషార్ధమైన మోక్షం.
★★★
Page 122