#


Index

  ఏ ఒకరి అనుభవమో అందుకు ప్రమాణ మంటే లోకం నమ్మకపోవచ్చు. అందుకేనేమో పండిత పామరుల ఇద్దరి అనుభంలోను ఉన్న ఒకా నొక అవస్థను దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు మన పెద్దలు. అదే నిద్రావస్థ. సుషుప్తి అని కూడా వ్యవహరిస్తారు. ఇంద్రియ ద్వారాలన్నీ మూతబడి పోతాయి అప్పుడు. మనకు తెలియకుండానే ఆరవ ఇంద్రియం అయిన మనస్సు ఈ భౌతికానికి దూరం అవుతూ అభౌతికమైన మరొక దానికి దగ్గర పడుతుంటుంది. వృత్తి రహితమై మనస్సు ఒక అద్దంలాగా పరిశుద్ధమయ్యే అవకాశముంది అక్కడ. అప్పుడే అది తన స్వరూపమైన బ్రహ్మ చైతన్యంలో అప్రయత్నంగా పోయి తలదాచు కుంటుంది. ఐతే వృత్తులు లేకున్నా వాసనలనేవి వదలిపోవు. దానితో తాత్కాలికంగా మోక్ష సుఖాన్ని అనుభవించినా అది నిలబడదు. ప్రారబ్దం కొద్ది వాససలు మరల వృత్తులుగా మారి జాగ్రదావస్థ లోనికి తెచ్చి పడవేస్తాయి. అది ము బంధమే.

  అంచేత సుషుప్తిని మోక్షానికి దగ్గర దశ అనుకోవలసిందే గాని మోక్షమేనని చెప్పరాదు. మోక్షమే అయితే మరల జాగ్రత్ లోనికి రాకూడదు. ఎంత వరకంటే ప్రతి దినమూ సర్పులకూ వస్తూ పోతూ ఉన్న ఈ దశను లోతుకు దిగి పరిశీలించటమే మన కర్తవ్యం సరిశీలిస్తే దృశ్య ప్రపంచం కనిపించకుండా పోవటమే కాదు మోక్షం కృక్కు నిలవటం దృక్కు నిలవటమే గాదు. అది నేనేనని భావించటం. భావించకుండా ప్రాపంచికమైన ఆయా వాసనలు మనస్సుకు అడ్డు తగులుతున్నాయి. అవి క్షాళితమై పోవాలి. అవి కూడా నా స్వరూపమేననే దృష్టితో దర్శించటమే సాధన. ఆత్మాకార వృత్తే ఆదర్శించే మార్గం. దీనికే బ్రహ్మ విద్య లేదా పరా విద్య అని పేరు. ఇంతకు ముందు వర్ణించింది అపర ఐతే ఇది వర.

Page 121