జీవ యాత్ర
1. ఈ సంసార మహా పురాణ రచనం బేనాడు సాగించెనో ఆ సచ్చిదన మూర్తి - అంత మను మాటైనస్ తలంపంగరా దాసర్గంబులు నా ప్రజా పతులు - నాయా వంశ చారిత్రముల్ భాసించున్ మరి య స్తమించు - మరలన్ భాసించు చక్రాకృతిన్.
2. ఏమని చెప్పవచ్చు పరమేశ్వర సృష్టి విచిత్ర రూపమై ఈ మహి నుండి యా దీవికి నెన్ని సహస్రము లెన్ని లక్షలో యామడ లేర్పరించి సదృశా సదృశంబుగ నెన్ని సంఖ్యలో భూమిక లన్ రచించి గ్రహ భూముల నిల్పి హరించు గ్రక్కునన్.
3. అందొక లిప్తయైన గలదా మనకాలము - దీని వేడబం బెందును గాన ముద్ధత మదేభము పోలిక సాగుచున్న - దీ చందము నీకు నాకు మన సా వచ సా తల పంగ శక్యమౌ చందము గాదు - దానికి వశం పదమై చనుచున్కి దక్కగన్ ॥
4. ప్రాణంబు లేదు మృత్పా షాణముల కట్టి ప్రాణమున్న వి గుల్మ పాదపములు ప్రాణంబుతో కొంత జ్ఞానమబ్బెను సరీ సృప కీటకాదుల సృష్టిలోన ఆజ్ఞాన ముపచితం బంత కంతకు జంతు జాలంబునకు పక్షి సంతతులకు అది వాసనా జ్ఞానమైన దానిని మించి నరజాతి కుదయించి న ది వివేక
Page 123