పడిపోతాము. ఇదే ఈ కథ మనకిచ్చే అమృత సందేశం. తొమ్మిదవ స్కంధమంతా అంబరీష సగర - భగీరథ రామాదులైన సూర్యవంశ రాజులచరిత్రా- యయాతి భరత రంతి దేవ యదు రాజాదులైన చంద్ర వంశ రాజులచరిత్రా- రెండింటితో నిండి ఉంటుంది. ఎంత జ్ఞాన విజ్ఞాన సంపత్తి ఉన్నా శమదమాది సంపత్తి లేకపోతే ఆ మానవుడు విపత్తి పాలు కావలసిందే నని అది ఉన్నవాడికి భగవంతుడి రక్ష ఎప్పటికైనా పని చేస్తుందని చెప్పటమే అంబరీషుడి కథ ద్వారా మనమర్ధం చేసుకోవలసింది. మరి ఎంత శ్రీమంతుడైనా కాలప్రభావాన్ని తప్పించుకోలేడని ఆత్మౌపమ్య దృష్టితో సమస్త భూతాలనూ ఉచ్చనీచాది భేదం లేకుండా దర్శించే మహాత్ముడే తత్ప్రభావాన్ని దాటిపోగలడని చెబుతుంది రంతి దేవుడి చరిత్ర. పోతే రాముని వల్ల పితృవాక్య పరిపాలనా యయాతి వల్ల స్వాత్మ పరిశీలనా - దుష్యంతుని వల్ల స్వాపరాధ పరిమార్జనమూ ఇలాటి సదుపదేశాలెన్నో గ్రహించవచ్చు.
పోతే దశమ స్కంధం చాలా పెద్దది. పూర్వోత్తరాలని రెండు భాగాలున్నాయి. ఇందులో వర్ణించబడినదంతా కృష్ణావతార చరిత్రే. దాని కనుబంధమైనవే మిగతా కుచేలోద్ధవాదుల కథలన్నీ. ఈ కృష్ణ చరితామృత వాహిని పూర్వోత్తర తటాలను రెండింటినీ ఒరుసుకొని ఏకాదశం దాకా ప్రవహించింది. మహర్షి శాప ప్రారంభమూ, ఉద్ధవోపదేశ మధ్యమమూ, కృష్ణ నిర్యాణ పర్యవసానమూ, ఈ ఏకాదశ స్కంధమనేది. పోతే ఇక ఆఖరిది ద్వాదశ స్కంధం. ఇది భాగవత మహానాటకానికొక భరతవాక్యం లాటిది. యుగధర్మాలూ, విశేషించి కలియుగ లక్షణాలూ మార్కండేయుడు నెపంగా అనంతకాలంలో జరిగే ప్రపంచ సృష్టి ప్రళయాది వర్ణనా తదభి వర్ణనైక ప్రయోజనమైన పురాణ సంహితా ప్రశంసనా ఇలాటి విషయజాతమంతా ఇందులో చక్కగా పొందుపడి ఉంది. మార్కండేయుడంటే అది ఒక సంకేతం. అనంత కాలానికీ, దేశానికీ - సృష్టి స్థితిలయాలకూ ఈ మహానాటకానికంతా ద్రష్ట అయిన ముక్తజీవుడు. జగన్నాటక స్రష్ట పరమేశ్వరుడైతే దానికి ద్రష్ట పరమ భాగవతుడైన నారదుడొకడు - మర్కండేయుడొకడు. వీరు చిరంజీవులు. జీవన్ముక్తులు. మానవులందరూ అలాటి పూర్ణ పురుషులు కావాలనే చివరకు సందేశం.
మొత్తం మీద భాగవత ద్వాదశ స్కంధ వృత్తాంతాన్నీ ఆద్యంతాలూ తడవి చూచాము. ఏది చూచినా, ఎక్కడ చూచినా, అది ఏ దేవతలో, ఋషులో,
Page 99