ప్రజాపతులో, మనువులో, వారి సంతానమో, తద్గుణ సాజాత్యమున్న మానవులో, వీరి గుణ చేష్టాదులే తప్ప మరేదీ లేదు. మరి వీరంతా ఎవరో కాదు. ఆ భగవంతుని విభూతి విశేషాలేనని చాటుతున్నది భాగవతం. అప్పటికా భగవంతుడి చరిత్రే నన్న మాట ఇదంతా. ఎక్కడ ఏది వర్ణించినా అది ఒక వ్యాజం మాత్రమే. ఆ నేపధ్యంలో Back-ground చేస్తున్నదీ, చూస్తున్నదీ, మాటాడుతున్నదీ, సుఖదుఃఖాదులను భవిస్తున్నదీ, అనుభవిస్తున్నట్టు అభినయిస్తున్నదీ, ఆ భగవానుడే. భాగవతమే చాటుతున్నదీ మాట.
ఇహతు పునర్భగవా నశేషమూర్తిః పరిపఠి తోను పదం కథా ప్రసంగైః
అని. స్వరూపంతో తాను కనిపిస్తూ విభూతి బలంతో ఆయా పాత్రలుగా భాసిస్తున్నదా ఒకే ఒక తత్త్వం. అది ఒకటే పాత్ర. చిత్ర విచిత్రమైన దాని నడవడిక ఒక్కటే కథ. తద్వారా ఏది ఆవిష్కరించినా అది ఒక్కటే మానవుడి కందించే సందేశం. వివిధ రూపాలుగా సాగిన ఈ పాత్రలూ, కథలూ అన్నీ దానికొక ఆలంబనమే. ప్రణాళిక Medium మాత్రమే. కాబట్టి ఎంత వైవిధ్యమున్నా ఎంత శాఖోప శాఖలుగా విస్తరించినా మూలమొక్కటే ప్రయోజనమొక్కటే కాబట్టి వస్వైక్యానికి గానీ, పాత్రైక్యానికి గానీ, ప్రయోజనైక్యానికి గానీ, వెతుకుకోనక్కరలేదు. అయత్న సిద్ధమైక్యమనేది. ఏకమైన పరమాత్మ తత్త్వమే అనేక రూపాలుగా వ్యాపించి మరలా ఆ ఏకైకమైన తత్త్వంలోనే లయమై చివర కేకరూపంగా మానవుడి అనుభూతికి రావాలనే భాగవత రచనా ప్రణాళికలో దాగి ఉన్న ప్రహేళిక (Irony)
Page 100