సంభూతుడు. గోరూపధారిణి అయి పరుగెత్తే ధారిణిని నిలిపి మరలా సస్యశ్యామలం చేసినవాడు. ప్రజానురంజనం చేసి రాజశబ్దాన్ని సార్ధకం చేసుకొన్నాడు. చివరకు విష్ణుదర్శనం చేసి తత్సాయుజ్యాన్ని పొందాడు. ఇది ఉత్తమ రాజలక్షణాలూ, ధార్మికమైన పరిపాలనా, ఎలా ఉండాలో తెలిపే గాథ. ఈ పృథువును గూర్చి చర్చించవలసినది ఎంతో ఉంది. తరువాత మనవి చేస్తాను. పోతే చివరది ప్రాచీన బర్హి వృత్తాంతం. ఇది అంతా ఒక పెద్ద అర్థవాదం Allegory. ఇది కూడా తరువాత ప్రవచింపబడుతుంది.
ఇక పంచమ స్కంధంలో మనుపుత్రుడైన ప్రియవ్రతుడూ, ఋషభుడూ, జడభరతుడూ, వీరి ఉపాఖ్యానాలు వస్తాయి. ఋషభుడు భగవదవతారమే. మహాయోగి. అంతకన్నా గొప్పవాడు భరతుడు. భారత వర్షమనే సంజ్ఞ మనదేశానికా మహాపురుషుడి మూలాన్నే ఏర్పడింది. భరత రహూ గణ సంవాదమంతా వేదాంత వాక్యరత్నాల కాకరం. భోగత్యాగాలను రెంటినీ సమానంగా అనుభవించి జీవితంలో పరిపూర్ణత అంటే ఏమిటో లోకానికి నిరూపించే రాజర్షుల ఉదంతాలివి.
షష్ఠ స్కంధంలో అజామిళ వృత్తాంతమూ, వృత్రాసుర సంహారమూ, చిత్రకేతు వృత్తాంతమూ ముఖ్యమైనవి. ఒకటి విష్ణు సంకీర్తన ఫలాన్నీ, మరొకటి జ్ఞానార్జనోపాయాన్నీ, వేరొకటి దంభ దర్పాది దుష్పరిపాకాన్నీ మనకు బోధిస్తాయి. ఇక సప్తమ స్కంధంలో అతిముఖ్యమైనది ప్రహ్లాద చరిత్ర. దీని విషయం తరువాత ఎలాగూ మనవి చేయబోతాను. కాబట్టి ప్రస్తుతానికి విరమిస్తాను. పోతే ఇక అష్టమ స్కంధం. ఇందులో గజేంద్ర మోక్షం, సముద్రమథనం, వామనచరిత్రా ముఖ్యమైనవి. సముద్రమంటే సంసారమే మానవుడి మనసే మందరం. దైవాసుర సంపదలతో నిరంతరమూ మథిస్తుంటాడు దాన్ని. అందులో ఎన్నో భోగ్యపదార్థాలు లభిస్తుంటాయి మనకు. అయినా తృప్తిలేదు. ఇంకా ఏదో సాధించాలనే మన ఆశ. చివరకలా ఆరాటపడుతుండగానే హాలాహలం లాంటి మృత్యువాసన్నమవుతుంది. అప్పటికైనా సద్గురూపదేశం వల్ల ఆత్మజ్ఞానాన్ని ఆర్జిస్తే మంచిదే. అమృతత్వాన్ని పొందగలడు. పరమేశ్వరుడంటే అలాంటి ఆచార్యుడే. అతడు సర్వజ్ఞుడూ, మృత్యుంజయుడూ. మనము ఆయనను శరణువేడితే అలాగే సర్వజ్ఞులమై మృత్యువును జయిస్తాము. లేదా జగన్మోహిని అయిన యోగమాయకు లోబడి మహామృతువు వాతనే
Page 98