#


Index

రచనా ప్రణాళిక

పరమేశ్వరుడి అంతవాడికి బిడ్డనిచ్చి కూడా అనవసరంగా ఆయనతో గిల్లి జగడం తెచ్చుకొన్న అవివేకి. ఆయననాహ్వానించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. కడకు కన్న కూతురు సమక్షంలో దగ్ధమవుతున్నా ఏమీ పట్టనట్టు చూస్తూ కూచున్నాడు. ఇలాటి మహాపచారంతో తానే చివర కాపరమేశుని కోపానలాని కాహుతయ్యాడు. ఇది ఉన్నతపదంలో ఉండి కూడా ఆ పదవీ గౌరవాన్ని నిలబెట్టుకోలేని ఒక అనాత్మజ్ఞాని చరిత్ర. జ్ఞానవిరహితమైన కేవల కర్మకాండ మానవుని ఉద్దరించలేదని కూడా ఒక సూచనే. ఇది దక్షుడి పశ్చాత్తాప వాక్యాలలోనే విదితమవుతుంది మనకు.

న బ్రహ్మ బంధుషుచ వామ్ భగవ న్నవజ్ఞా యోసౌ మయా 2 విధత తత్త్వ దృశా సభాయాం క్షిప్తో దురుక్తి విశిఖై రగణయ్య తన్మామ్ అర్వా కృతంత మర్హత్తమ నింద యా పాత్

  నేను ద్విజబంధుణ్ణి కాని నిజమైన ద్విజన్ముణ్ణి కాను. నీతత్త్వం తెలియక నిందించాను. అయినా నీవది గణింపక పతితుడనైన నన్నను గ్రహించావదే చాలునని మొరపెడతాడు.

  ధ్రువుడి చరిత్ర ఇంకా చిత్రమయింది. మనువుకు సాక్షాత్తు మనుమడే ఇతడు. సవతి తల్లి చేసిన అవజ్ఞ భరించలేక అడవికి వెళ్ళి తపస్సు చేస్తాడు. విష్ణువును ప్రత్యక్షం చేసుకొంటాడు. అనన్య దుర్లభమైన పదవిని సాధిస్తాడు. పరమపద సాధనలో శ్రద్ధా తాత్పర్యాలనేవి ఎలా ఉండాలో అవి ఎప్పుడో వార్ధక్యంలో కాక బాల్యంలోనే ఎలా పాదు చేసుకోవాలో తెలుపుతుందీ కథ. పైగా గురూపదేశ ప్రభావాన్ని కూడా నిరూపిస్తుంది. ధ్రువుణ్ణి గూర్చి చెప్పవలసింది చాలా ఉంది. అది ఉత్తరత్రా మనవి చేస్తాను. ధ్రువుడి తరువాత పృథుచక్రవర్తి. ఇతడు ధ్రువుడి కెన్నో తరాలు తరువాతి వాడైన వేనుడి కుమారుడు. వేను డాజన్మ దుర్జనుడు. “యదౌశ్శీల్యాత్స రాజర్షి ర్నిర్విణ్ణా నిరగాత్పురాత్" అతడి దుశ్చేష్టలకు విసిగి కన్నతండ్రే సన్న్యసించి వెళ్లిపోయాడు. తరువాత అతణ్ణి మహర్షులు రోషకషాయితమైన దృష్టులతో చూచి దగ్ధం చేస్తారు. అతడి ఊరువు మథిస్తే దానిలో నుంచి జన్మిస్తాడు పృథువు. అతడెంత దుశ్శీలుడో ఇతడంతటి సాధుశీలుడు. “నావిష్ణుః పృథివీపతిః” అన్నట్టు సాక్షాద్విష్ణ్వంశ

Page 97

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు