ఆ భగవానుడి విభూతేనని వర్ణించటం వల్ల ఇక పురాణంలో ఎక్కడ ఏ కథ వచ్చినా ఎవరి విషయం ప్రస్తావించినా- అది ఆ పాత్రలద్వారా పరిస్థితుల ద్వారా భగవద్గుణ లీలాగానం చేయటమే దాని అపదేశంతో Pretext మానవులందరికీ జీవిత గమ్యమైన పరమ పురుషార్థ మహాఫలాన్ని సాక్షాత్తుగానో పరం పరంగానో ప్రసాదించటమే. అంతకుమించి మరేమీ గాదని మనం స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు.
ఈ ఉదాత్త విశాలమైన దృష్టితో ప్రస్తుత మీ భాగవత కథా నిర్మాణాన్నంతటినీ స్థాలీపులాకన్యాయంగా ఒక్కసారి పరిశీలించి చూతాము. అసలు ప్రథమ స్కంథంలో భాగవతావ తరణానికి హేతుభూతుడైన పరీక్షిత్తు విష్ణ్వంశ సంభూతుడే. మరి సంయమీంద్రుడైన శుకయోగిని చెప్పనక్కరలేదు. శౌనకాదులందరూ మహర్షులే. తన్ముఖంగా జరిగిన భాగవత కథా విర్భావమంతా భగవన్ముఖోద్గతమే సందేహం లేదు. పైగా బహుజన్మ సుకృత పరిపాకముంటే గాని మానవుడు తరించడని చెప్పటానికి నారదుని జన్మాంతర వృత్తాంతం. ముందు ముందు జీవితమెలా గడచినా రాను రాను శమదమాదులార్జించి భగవద్భక్తి నలవరుచుకోవాలని ప్రబోధించటానికి కుంతీ పాండవ భీష్మ ధృతరాష్ట్రాదుల చరిత్రా - కడకు మహాపురుషుల రాకపోకలు చూచి అయినా నేర్చుకోమని చెప్పటానికి కృష్ణ నిర్యాణమూ, ఇందులో పొందు పరిచాడు మహర్షి. పోతే ద్వితీయస్కంధంలో శుకమహర్షి ఖట్వాంగుడనే రాజర్షి చరిత్రతో ప్రారంభిస్తాడు భాగవత కథ. ఏడు రోజులలో మరణిస్తానని బాధపడుతుంటే పరీక్షిత్తు అలా పడనక్కరలేదు. ముముక్షువైన వాడి కేడు రోజులెందుకు. ఏడు గడియలు చాలు. ఆ మాటకు వస్తే ఒక్క ముహూర్త కాలంలో ఇక ఆయువు ముగుస్తుందన్నపుడు కూడా నిజమైన పరమార్థ నిష్ఠ ఉన్నవాడు తరించటంలో అభ్యంతరం లేదని చెప్పటానికీకథ చెప్పాడు శుకుడు. ఖట్వాంగుడనేది నెపం. ఇది మనకోసం చేసిన హెచ్చరికే మరేదీ గాదు. ఈ ఖట్వాంగుడెవరో గాదు మరలా. సూర్యవంశ ప్రవర్తకులలో ఒకడు. రఘు మహారాజుకు పితామహుడు. నవమ స్కంధంలో భగీరథుని తరువాత శ్రీరామ జననానికి ముందు ఇతని ప్రస్తావన వస్తుంది. దేవతల కార్యం నిర్వర్తించిన తరువాత వారు ప్రీతులై వరమిస్తామంటే నా ఆయుష్కాలం చెప్పమని అడుగుతాడు. వారొక ముహూర్తకాలమే ఉందని చెబితే వెంటనే భూలోకానికి వచ్చి తపస్సు చేసి తరిస్తాడు. ఇదే జీవితానికంతటికీ కోరదగిన
Page 94