#


Index

రచనా ప్రణాళిక

సెలవిచ్చినట్టు భగవంతుడి అవతారం కానిది సృష్టిలో ఏదీలేదు. అందుకే భాగవతమిలా ఘోషిస్తున్నది. సరసిం బాసిన వేయి కాలువల యోజన్ విష్ణునందైన శ్రీ కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు - లుర్వీశులున్ సురలున్ బ్రాహ్మణసంయ మీంద్రులు మహర్షుల్ విష్ణు నంశాంశజుల్

  ఒక మహానది ప్రవహిస్తూంటే దానిలో నుంచి కొన్ని వందల కాలువలు త్రవ్వుతాము. వాటిని పంట పొలాలవైపు మళ్లిస్తే పంటలు ఏకధాటిగా పండుతాయి. అలాగే ఆ పరమాత్మ చైతన్యం నుంచి కూడా అనేకానేక చైతన్యశాఖ లవతరిస్తున్నాయి. భూమండలాన్ని పాలించే క్షత్రియులూ, బ్రాహ్మణులూ, దేవతలూ, మహర్షులూ, యోగీశ్వరులూ, ఒకరేమిటి, సమస్త ప్రజానీకమూ, ఆ చైతన్య విభూతే. దాని అంశలూ, అంశాంశలే. అంతకన్నా ఇతరమైనదేదీ కానరాదు.

  ఇందులో ఒక రహస్యమున్నదిలా చెప్పటంలో. మనువులనే వారీ క్షత్రియ జాతికి చెందినవారే. పోతే అత్రికశ్యపాదులైన ప్రజాపతులంతా బ్రాహ్మణజాతి క్రిందికి వస్తారు. వీరే తరువాత ప్రపంచ సృష్టికంతా మూల పురుషులు. నారాయణ నాభి కమలం నుంచి బ్రహ్మ జన్మిస్తే ఆ బ్రహ్మ సృష్టించిన వారీ మనువులూ, ప్రజాపతులూ, వీరా తరువాత కన్న సంతానమే భూత జాతమంతా. వీరిలో వైవస్వతాది మనువులందరూ క్షత్రియులూ, కశ్యపాదులైన ప్రజాపతులు బ్రాహ్మణులని గదా చెప్పాము. ఒకరు రజోగుణ ప్రధానులైతే మరొకరు సత్త్వగుణ ప్రధానులు. సత్త్వరజ స్సంపర్కముంటేనే జ్ఞానక్రియా దోహదకారి. అందుకే మనువులు ప్రజాపతుల బిడ్డలను పెండ్లాడితే ప్రజాపతుల సంతతిని మనువులు వివాహమాడినట్టు వర్ణిస్తుంది పురాణం. పోతే వీరికిటు భూలోకంలో తోడ్పడటానికి నారదాది మహర్షులూ, కపిలాది సంయములూ, అటు దేవలోకంలో అగ్ని వరుణ కుబేరవాయ్వాది దేవతానీకమూ. వారు తమ తపః ప్రభావం చేతనూ, సహజమైన దివ్యానుభావం చేతనూ మానవ జీవితాలను పరిపుష్టం చేయగలరు.

  ఇలా భావన చేస్తూ పోతే ప్రతి ఒక్కటీ మానవాభ్యుదయం కోసమే భగవంతుడి ప్రయత్నమంతా తదేకోన్ముఖమే. దేవ ఋషి మను ప్రజాపతి ప్రభృతి సృష్టి అంతా

Page 93

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు