ఉపనిబద్ధమయింది. మూడులో వరాహకథా, ఏడులో నృసింహ కథా, ఎనిమిదిలో కూర్మ మత్స్య వామనుల వృత్తాంతమూ, తొమ్మిదిలో రామ పరశురాముల చరిత్రా, పది పదకొండులలో రామకృష్ణుల ఉదంతమూ, కాగా పన్నెండులో కల్కి పరాక్రమమూ, ఇదీ వరస. ఇది కూడా ఏదో ఊరక యాదృచ్చికంగా ఏకరువు పెట్టిన వరుసగా కనిపించదు. దశావతారాలనీ క్రమంలోనే భాగవతం వర్ణించటంలో చాలా అంతరార్థమున్నది.
అవతారమనేది మానవుడి కోసమే మానవజాతి ఉద్ధరణ కోసమే. అందులో మొదట మానవుడి కొక స్థిర నివాసం కల్పించటం కోసమెత్తినదే వరాహావతారం. అది భగవత్కృతం కాదు. తన ప్రమేయమేనని భావించేవాడి కోసం నృసింహావతారం. అలా కాక తన్ను సర్వాత్మనా నమ్మినవారి కమృతత్వాన్నే ప్రసాదించటానికి కూర్మావతారం. అది రేపు ప్రళయంలో కూడ మానవుణ్ణి కాపాడుతుందని చెప్పటానికే మత్స్యావతారం. దానివల్ల అంతకంత కూర్ధ్వ లోకాలకు పయనించి పరంధామాన్నే చేరుతాడని సూచించేది వామనం. అలాటి పరమపద ప్రాప్తి నందుకోవాలంటే త్రిగుణాల వాగురలో తగులుకొన్నంత వరకూ ప్రయోజనం లేదని చాటటానికే రామ పరశురామ బలరామావతారాలు. ఇవి మూడూ వరుసగా సత్త్వరజస్తమో గుణాలకూ ప్రతీకలు. వాటి నతిక్రమించటమంటే వాటిలో ఉంటూనే వాటి నధీనం చేసుకొని తన మాయతో తానే క్రీడించటమనే పరావర సామరస్యాన్ని నిరూపణ చేస్తుంది కృష్ణావతారం. దానితో చివరకు మానవుడు కాలానికి కూడా అతీతుడై తన ఇచ్ఛానుసారం కాల దేశ వస్తు ధర్మాలను నడుపుతూ విశ్వ ధర్మ సూత్రాన్ని అవిచ్ఛిన్నంగా సాగిస్తూ పోతాడని చెబుతుంది కల్కి. ఇదీ భాగవత పురాణమంతా పనగలిసి ఉన్న దశావతార వృత్తాంత రహస్యవాదం.
అసలు దశావతారాలు కూడా కావు. ఏకవింశ త్యవతారాలు వర్ణించింది భాగవతం. కుమారస్వామి, నారదుడు, నరనారాయణులు, కపిలుడు, దత్తాత్రేయుడు, యజ్ఞుడు, ఉపక్రముడు, పృథుచక్రవర్తి, ధన్వంతరి, వేదవ్యాసుడు, కడపటికి బుద్ధుడితో కూడా దశావతారాలలో చేరి ఇరువది ఒక్క అవతారాలయినాయి. అసలా మాటకు వస్తే పది ఏమిటి ఇరువది ఒకటేమిటి. పరశ్శతాలూ పరస్సహస్రాలని చెప్పినా చెప్పవచ్చు అవతారాల సంఖ్య. సర్వమూ భగవద్వ్యూహమేనని భగవత్పాదులు
Page 92