#


Index

రచనా ప్రణాళిక

చేయాలి. ఎలాగ. అప్పుడెక్కడ చూచినా జలం తప్ప మరేమీ లేదు సృష్టిలో. భూమి అనేది దానిలో దిగబడి ఎక్కడో అడుగున బడిపోయింది. దాని నుద్ధరిస్తే గాని వారికుండటానికి నివాసమనేది దొరకదు. దానికేమి టుపాయమని దిక్కుతోచక చతుర్ముఖు డాలోచిస్తుంటాడు. వెంటనే ఆయనకు తెలియకుండానే ఆయన ముకుజెరమల నుంచి భగవానుడు శ్వేత వరాహరూపంగా అవతరిస్తాడు. దీర్ఘ నిశాత దంష్ట్రలతో ఆ రసాతల మగ్నమైన భూమండలాన్ని పైకి లేపి మను దంపతులకు నివాసాన్ని కల్పిస్తాడు.

  ఏమిటి దీని అంతరార్థం. మను సంతతి మానవులు. వారు కేవల జలార్ణవంలో జీవించలేరు. జలావృతమైన భూమి ఒక్కటే వారికి నివాస యోగ్యం. అది మానవ యత్నంతో ఒనగూడేది గాదు. దైవికమైన సంకల్పం వల్లనే ఫలిస్తుంది. అలాగే ఫలించిందిప్పుడీ భూలోక నివాసం మనబోటి మానవులకని భావం. పైగా యజ్ఞ వరాహమనేది ఋగ్యజురాదులైన నాలుగు వేదాలూ, తత్ప్రచోదితమైన ధర్మ కలాపమే దాని స్వరూపం. మానవుడు పుట్టిన తరువాత శాస్త్ర చోదితమైన సత్కర్మ లాచరించాలి. తద్ద్వారా తన జీవిత గమ్యాన్ని సాధించాలి. అందుకే ఈ మానవ సృష్టి అసలు. దాని కనురూపమైన కర్మభూమిని సృష్టించిన ఈ యజ్ఞరూపుడైన పరమాత్మ ఒక గొప్ప సంకేతం. అంతేకాదు. హిరణ్యాక్ష వధ కూడా ఇప్పుడే జరిగింది. ఇదికూడా ఒక సంకేతమే. హిరణ్యమంటే బంగారం లేదా ధనం. అక్షి అంటే దృష్టి లేదా చూపు. మానవుడి చూపు యావజ్జీవమూ ఐహికమైన భోగభాగ్యాల మీద కాదుండవలసింది. “మాగృధః కస్యస్వి ధనమ్" అని శాస్త్రం. అయితే దేని మీద. కర్మ ఫల రూపమైన ఆముష్మికం మీద అని చెప్పటమే హిరణ్యాక్ష వధలోని అంతరార్ధం.

  పోతే ఇక రెండవదిగా మనం చెప్పుకొనే కూర్మావతార వృత్తాంతం. ఆరవ మనువైన చాక్షుషుడి కాలంలో జరిగింది. వరాహావతారం మొదటివాడైన స్వాయంభువ మనువు కాలంలో అయితే ఇది ఆరవవాడైన చాక్షుష మనువు కాలంలో. అంచేత వరాహావతార కథ మొదటా కూర్మావతార కథ తరువాతా వర్ణించబడ్డాయి. అది భాగవతం తృతీయ స్కంధంలో అయితే ఇది అష్టమ స్కంధంలో వస్తుంది. మరలా ఈ చాక్షుష మన్వంతరంలో దేవ ఋషి గణాదులన్నీ మారిపోతాయి. మహావిష్ణువిక్కడ సంభూతి వైరాజులనే దంపతులకు అజితుడనే పేరుతో అవతరిస్తాడు.

Page 89

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు