#


Index

రచనా ప్రణాళిక

అయితే ఈ అవతార కథా నిబంధనలో ఒక వ్యత్యాసం దొరలినట్టు భాసిస్తుంది మనకు. మత్స్య కూర్మ వరాహాది క్రమంగా వర్ణించవలసిన అవతారాలను కొంత వ్యతి క్రమం చేసి వర్ణించింది భాగవతం. మొదట వరాహావతార వర్ణన, తరువాత ఎక్కడో మత్స్యావతారమూ దానికి ముందు మరలా కూర్మావతారము. అలాగే రామావతారమూ తరువాత పరశు రామావతారమూ ఇలాటి వ్యుత్ప్రమం మనకు గోచరిస్తున్నది. ఇలా ఎందుకు జరిగిందని జిజ్ఞాసువులకు సందేహమేర్పడటం సహజమే. దీన్ని నివారించుకోవాలంటే కొంత లోతుకు దిగి పూర్వాపర విచారణ చేయుట ఆవశ్యకం.

  “మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః” అని ఒక క్రమాన్ని లోకులనూచానంగా Traditional చెప్పుకొంటున్నారు. భాగవతమిలాటి లౌకికమైన క్రమాన్ని గాదు పాటించింది. అది ఆయా మనువుల కాలక్రమాన్ని బట్టి అవతార చరిత్రను చిత్రిస్తూ వచ్చింది. భాగవతమంటే మనుచరిత్ర కూడా కదా. అందులో ఒక్కొక్క మన్వంతరం గడిచాక ఇంద్ర దేవ ఋషి గణాలు మారుతూ పోతాయి. వాటితో పాటు భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి. ఈ మనువుల సంఖ్య మొత్తం పద్నాలుగని మన పురాణాల పరిగణన. వారు వరుసగా స్వాయంభువుడూ, స్వారోచిషుడూ, ఉత్తముడూ, అతని తమ్ముడు తామసుడూ, ఆ తామసుని తమ్ముడు రైవతుడూ, చాక్షుషుడూ, పోతే శ్రాద్దదేవుడనే పేరు గల వైవస్వతుడూ, తరువాత క్రమంగా సూర్యదక్ష బ్రహ్మ ధర్మ భద్ర దేవ ఇంద్ర సావర్ణులూ ఇలా పదునలుగురు.

  వీరిలో మొదటివాడైన స్వాయంభువ మనువు కాలం వరాహ కల్పంలో వస్తుంది. అప్పటికి బ్రాహ్మం పాద్మమని రెండు కల్పాలు జరిగిపోయాయి. పోతే మూడవది వరాహ కల్పం. శ్రీ మహావిష్ణువు వరాహావతార మెత్తి రావడం మూలాన్నే దీనికి వరాహ కల్పమని సంజ్ఞ ఏర్పడి ఉండవచ్చు. ఇది మొట్టమొదటి మనువు కాలంలో జరిగిన వృత్తాంతం కాబట్టి మన్వంతర క్రమాన్ని బట్టి దశావతారాల్లో వరాహావతార కథే ముందుగా వర్ణించవలసి వచ్చింది. ఇది చాలా చిత్రమైన గాథ. స్వయంభువంటే బ్రహ్మదేవుడు. ఆయన మానస పుత్రుడే ఈ స్వాయంభువ మనువు. మిథున రూపంగా జన్మించాడాయన. ఆయన భార్య పేరు శతరూప. వీరిరువురూ కలిసి ప్రజాభివృద్ధి

Page 88

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు