#


Index

రచనా ప్రణాళిక

ఎప్పుడన్నామో అవి కలియుగ చరిత్రలో కలిసి ఉన్నట్టు ప్రస్తావించటం కూడా ఒక సబబే. కనుకనే రామాయణం భారతంలో కనిపిస్తే భారత రామాయణ వృత్తాంతాలు రెండూ కలిసి భాగవతంలో దర్శనమిస్తాయి. యుగక్రమాన్ని బట్టి చూస్తే ఇది సమంజసమే గదా. ఇందులో కూడా మరి ఒక ధర్మ సూక్ష్మమున్నది. దశావతారాలను వర్ణించేటపుడు రామావతార వర్ణన కూడా రాక తప్పదు. కనుక రామాయణ ప్రస్తావన భాగవతంలో రావటంలో అనౌచిత్యం లేదు సరి గదా ఎంతైనా అవసరం.

  పోతే ఇక భారత వృత్తాంత ప్రస్తావన అంతకన్నా ఆవశ్యకం. కృష్ణుడు లేనిదే భారతకథే లేదసలు. పాండవులని పేరే గాని కథ నడిచిందంతా కృష్ణుడి చేతి మీదనే. అదంతా ఒక్క పద్యంలో గుప్పించి చాలా గొప్పగా చెప్పాడు పోతనామాత్యుడు.

పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కు లం జంచద్గర్వుల ధార్త రాష్ట్రుల ననిం జంపించి గోవిందు డి ప్పించెన్ రాజ్యము పాండవేయులకు గల్పించెన్ మహాఖ్యాతి - చే యించెన్ మూడు తురంగ మేధములు దేవేంద్ర ప్రభా వోన్నతిన్

  ఇంత హృద్యమైన పద్యం మరొకటి కానరాదు. ఎంతో విసురుగా సహజంగా, సుందరంగా, గంభీరంగా సాగిన పద్యమిది. కౌరవులను చంపింది పాండవులు కాదు. చంపించింది కృష్ణుడేనట. అసలు కృష్ణుడు కూడా అక్కరలేదు. వాళ్లు చేసిన మహాపాపమే వారి ఆయుస్సును హరించింది. అది పాంచాలీ కబరీ వికర్షణమే. దానితో వారి కాయుష్కాలం తీరితే అది తెలిసిన భగవానుడు ప్రేరణ చేస్తే దాని నందుకొని తత్సంహారానికి నిమిత్త మాత్రులయ్యారు పాండవులు. వారు రాజ్యం సాధించలేదు. సాధించి పెట్టాడు భగవానుడు. ఆయనే వారికెక్కడ లేని ఖ్యాతి నార్జించి పెట్టాడు. తుదకు ఒకటి గాడు రెండు గాదు. మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు ధర్మరాజు చేత. చేయటం వరకే ధర్మరాజు. వెనకాల ఉండి చేయించిన వాడు కృష్ణుడే. అంతేకాదు. చివర కశ్వత్థామ కోపాగ్ని జ్వాలలో పడి భస్మమై పోకుండా పసికందును కాపాడి పాండవ వంశాన్ని నిలబెట్టింది కూడా ఆ మహాత్ముడే. ఆ పసి బాలుడే గదా పెరిగి పెద్ద వాడయి భాగవత కథావతరణానికి మూల కారణమయింది. కాబట్టి భారత కథా వృత్తాంతం భాగవతారంభంలో రావటమెంతైనా అవసరం

Page 86

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు