#


Index

రచనా ప్రణాళిక

పాళ్లు కనిపిస్తుంది. నామరూప చేష్టలే గదా విభూతి అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు నామాలు. మత్స్య కూర్మాద్యవతారాలు రూపాలు. పోతే ఆయా అవతారాలెత్తినప్పుడు ఆయన చేసే దుష్ట శిక్షణ శిష్ట రక్షణాది కార్యాలు చేష్టలు. ఇవన్నీ కలసి ఆయన చరిత్ర. అదే ఈ పురాణమంతా కొనా మొదలు పన గలిసి ఉంది.

  భాగవతమంటే భగవంతుడి చరిత్ర అనే గాక భాగవతుల చరిత్ర అని కూడా ఒక మాట చెప్పి ఉన్నాము. భగవంతుడి నాశ్రయించినమానవుడే భాగవతుడు. మానవుడికి రెండింటితోనే సంబంధం. ఒకటి ఈ లోకంతో. మరొకటి లోకాతీతమైన తత్త్వంతో. అందులో ఈ లోకంతోనే ముడిపడిన జీవితాలు సామాన్య జీవితాలు. అలా కాక తత్త్వంతో ముడిపడ్డవి భాగవత జీవితాలు. అలాంటి భాగవతుల జీవిత కథలు కూడా భగవత్కథతో పాటు నడుస్తూ వస్తాయి ఈ పురాణంలో. శుక శౌనక నారద ప్రహ్లాదాంబరీష పృథుధ్రువ కుచేల గజేంద్ర గోప గోపికాదుల చరిత్రలన్నీ అవే. ఇవి కూడా భగవత్కథలే వాస్త వానికంతకన్నా వేరు గావు. దుష్ట నిగ్రహ శిష్ట పాలనాదులే గదా ఆయన చేష్టలు. ఆశిష్ట పాలన ఏలాటిదో చూపటమే గదా ఈ భాగవతుల కథలన్నీ. అంచేత నిజానికంతా భగవత్కథే. భక్తుల కథలైనా అది భగవత్కథే. భక్తుణ్ణి భగవంతుణ్ణి వేరు చేయలేము. వేరయితే వాడు విభక్తుడవుతాడే గాని భక్తుడు కాడు. కాబట్టి భాగవతమంతా ఇంతకూ భగవంతుడి కథా వర్ణనమే.

  అందుకే ఈ పురాణాన్ని హరికథా మృతమని కొని యాడారు. “ఏ కథల యందు పుణ్య శ్లోకుడు హరి చెప్పబడును - ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు.” హరి అంటే పాపాలు హరించేవాడు, విష్ణువు, ఆ విష్ణువెవరో గాదు కృష్ణుడే. “ఆ హరి కృష్ణుండు బలానుజన్ము డెడలే దావిష్ణువౌ నేర్పడన్" భగవంతుడి దశావతారాలలోనూ పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారం. అందుకే “కృష్ణస్తు భగవాన్ స్వయమ్” కృష్ణుడే సాక్షాత్తు భగవంతుడన్నారు. అంటే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నన్నమాట. దీన్ని గూర్చి ఇంకా ముందు ముందు విపులంగా చర్చించబోతాము. మొత్తానికి విష్ణు కథ లేదా కృష్ణ కథ అనుకోవచ్చు భాగవతమంతా. అనుకోవచ్చునని పురాణామే మనకు సాక్ష్యమిస్తున్నది. “లలిత స్కంధము కృష్ణమూలము” కృష్ణుడే దీనికి మూలాధారం. అంటే పురాణమంతా కృష్ణ తత్త్వాన్ని ఆశ్రయించి దానిచుట్టూ నడుస్తూ ఉందని భావం. ఇది గమనించే మహాకవి పోతనా

Page 82

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు