#


Index

ప్రతిష్ఠాపన

  తత్త్వం. దాని మీద ఆధారపడ్డదే మిగతా ప్రపంచమంతా కాబట్టి దాని స్వరూపమేమిటో ముందు సాంగోపాంగంగా తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది మనకు. తెలుసుకొంటే ఆ తత్త్వ సాహిత్యం వెలుగులో సాహిత్య గ్రంథాలను పరిశీలించవచ్చు. వాటి విలువలు నిర్ణయించవచ్చు. తత్త్వమనేది లక్షణమైతే Science సాహిత్యమనేది దానికి లక్ష్యం Application or illustration. లక్షణాన్ని లక్షణంగానే చూచామింతవరకూ, దానినిప్పుడు లక్ష్యంతో కూడా సమన్వయించి చూడబోతాము. అలా చూడటంవల్ల శాస్త్రజ్ఞానం పాఠకులకు చక్కగా మనసుకు పడుతుంది. ఒక విధమైన ప్రరోచన Taste కలుగుతుంది. ఇది మన తలకు మించిందనే భయం తొలిగిపోయి అతిసన్నిహితమనే భావమేర్పడుతుంది. అంతేకాదు, తత్త్వమూ, సాహిత్యమూ రెండూ తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదమని వేరుగాక రెండూ ఒకటేననే సమన్వయ జ్ఞానముదయిస్తుంది.

  అయితే కొందరు బుద్ధిమంతులిలా ఆశంక చేయవచ్చు. సాహిత్యమంటే పురాణేతి హాసాలు, కావ్యనాటకాలూ, నవలా కథానికలూ ఇలాంటి ప్రక్రియలు గదా సాహిత్యం. దీనికీ మీరు చెప్పే వేదాంతానికి ఏమి సంబంధం. దాని వెలుగులో దీనిని విమర్శించటమేమిటి. ఈ ప్రక్రియలను విమర్శించాలంటే సాహత్య లక్షణమనేది వేరే ఉంది గదా. కథా వస్తువూ, సన్నివేశాలూ, వివిధ పాత్రలూ, వారి ప్రవృత్తులూ, వర్ణనలూ, కల్పనలూ ఇంకా ఆయా అలంకారాలూ, రీతులూ, వృత్తులూ, రసభావాలూ ఇలాంటి దృష్టితో గదా చూడవలసింది సాహిత్య గ్రంథాలను, అది వదలిపెట్టి జుట్టుకూ మోకాళ్లకూ ముడి వేసినట్టు వేదాంతానికీ దానికీ ముడివేయటమేమి బాగు.

  ఇది సరిగా ఆలోచించక చేసే ఆక్షేపణ. వేదాంతమూ, తత్త్వమూ అనగానే నూటికి తొంబది తొమ్మిది మంది తలపట్టుకొని కూచుంటారు. ఏదో వినరాని మాట విన్నట్టు బాధపడతారు వారు. అన్ని జ్ఞానాలకూ అంతిమమైన జ్ఞానమేదో అది వేదాంతం. అన్ని పదార్థాల తాలూకు స్వరూపమేదో అది తత్త్వం. నిత్యజీవితంలో మనమేదైనా చూస్తే, ఇది ఏమిటిది, దీని తత్త్వమేమిటి, ప్రయోజన మేమిటని ప్రశ్నిస్తాము. దానికి జవాబు దొరికే వరకూ విచారణ సాగిస్తాము. జవాబు దొరికితే ఏదో

Page 6

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు