#


Index

భాగవత ప్రాశస్త్యము

అయి ఉండాలి. రసగ్రహణ సమర్థుడే రసికుడు. రసోవైసః అని పరమాత్మ అసలు రస స్వరూపుడు. ఆ రసాన్ని భజించాలంటే ఈ భజించే మానవుడిలో కూడా ఆ గుణముండి తీరాలి. నిసర్గ సిద్ధంగా అలాటి గుణమొకటి ఉంటే అది క్రమంగా భావన చేసే కొద్దీ పరిపక్వమయి చివరకు తానూ పూర్ణరస స్వరూపుడే అవుతాడు జీవుడు. కనుకనే భావుకుడు కూడా కావాలని చెప్పటం. ఇందులో రసికత్వమనే గుణం నైసర్గికమైతే భావుకత్వం సాంస్కారికం. రెండూ ఒనగూడితేనే ఫలసిద్ధి.

  ఇంతటి మహాఫలాన్ని ప్రసాదిస్తున్నదీ మహాపురాణం. ఈ పురాణ స్వరూపాన్నంతటినీ ఒక కల్ప వృక్షంతో పోల్చి ఎంతో మనోహరంగా వర్ణించాడు పోతన మహాకవి. అభీష్ట ఫలప్రదాయి గనుక నిజంగా అది కల్పకమే. సందేహం లేదు. అందుకే ఈ రూప కల్పన.

లలిత స్కంధము కృష్ణ మూలము - శుకాలా పాభిరామంబు - మం జాలతా శోభితమున్ – సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్ - సుందరో జ్జ్వల వృత్తంబు - మహాఫలంబు- విమల వ్యాసాల వా లంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై

  ఈ పద్యం పోతన స్వతంత్రం రచన. దీనికి మూల భూతమైన శ్లోకం మాతృకలో కానరాదు. కాని నన్నయ భారతంలో దీని కనురూపమైన పద్యమొకటి కనిపిస్తుంది.

అమితా ఖ్యానక శాఖ లం బొలిచి వేదార్థా మలచ్ఛాయమై సుమహా వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి - కృష్ణార్జునో త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై - ద్వైపాయనో ద్యానజా త మహాభారత పారిజాత మమరున్ - ధాత్రీసుర ప్రార్థ్యమై

  భారతమనేది ఒక పారిజాతమనుకొంటే దాని కాశ్రయమైన ఉద్యానవనం ద్వైపాయనుడైన వ్యాసమహర్షి. ఆ పారిజాతానికి శాఖలనేవి ఏవో కావు. అసంఖ్యాకమైన ఉపాఖ్యానాలు. చతుర్వేదార్థసారమే దాని పుష్పగుచ్చాలు. నర నారాయణుల గుణ సంకీర్తనమే అది మన కందించే ఫలం. ఇలాంటి వృక్షాన్ని ఆశ్రయించే మహాపురుషులు దేవలోకంలో అయితే సురలు. భూలోకంలో ధాత్రీ సురులు. సరిగా ఈ భారత పారిజాత వర్ణన కనుగుణంగా సాగింది భాగవత

Page 54

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు