ఈ ప్రకారంగా సత్య ధర్మ ప్రతిపాదన కోసమే ఈ రెండు వృత్తాంతాలూ భాగవతంలో ప్రస్తావించబడ్డాయని తోస్తుంది. ఇందులో వృత్తవధ భాగవతం సాక్షాత్తుగానే వర్ణిస్తుంది. గాయత్రిని మాత్రం అలా వర్ణించినట్టెక్కడా కనిపించదు. సాక్షాత్తుగా లేకపోయినా పరం పరయా దానిని కూడా పరామర్శించటం మాత్రం జరిగింది. అది కొంచెం సూక్ష్మదృష్టితో చూస్తేగాని తెలియదు. కృష్ణావతారానికి ముందు యోగమయ ఆవిర్భావం జరిగింది. ఆవిడను కంసుడు పైకి ఎగురవేయగానే అలాగే ఆకాశంలో నిలిచిపోయింది. అంతేగాక అష్ట బాహువులతో భయంకరంగా సాక్షాత్కరించింది. ఆయోగమాయే గాయత్రి. గాయత్రి దేవికి సరిగా అష్ట బాహువులే. “ఉత్తమే శిఖరే జాతే-ప్రచోదయంతీ పవనే ద్విజాతా" ఇలాంటి గాయత్రీ వర్ణన చూస్తే ఆవిడ ఆకాశంలో సంచరిస్తున్న దివ్య సుందరమూర్తి మనకు ప్రత్యక్షమవుతుంది. ఆ యోగమాయనే దుర్గ, కాళి, భద్ర అని అనేక నామాధేయాలతో లోకులు పూజిస్తారని భాగవతం పేర్కొనటం కూడా చూస్తే ఆ దేవత ఎవరో గాదు - సకల జనారాధ్య అయిన గాయత్రీ మంత్రాధి దేవతేనని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇలా మంత్ర స్వరూపాన్ని వాచ్యంగా కాక భంగ్యంత రంగా ధ్వనింపజేస్తున్నది భాగవతం.
కనుక వృత్త వధ గాయత్రీ మంత్రార్థమెక్కడ ప్రస్తావించబడితే అది భాగవత మనటంలో ఇదీ అంతరార్థం. దీనికింకా ఉపోద్బలకమైనవి మనకు భాగవతారంభం లోనే రెండు వృత్తాంతాలు కనిపిస్తాయి. ఒకటి శుకుడిది. మరొకటి వ్యాసుడిది. వీరిరువురే భాగవత కథా సౌధ నిర్మాణానికంతటికీ మూలస్తంభాలు. వీరు లేకుంటే భాగవతమే లేదు. ఇందులో నారదుడు వ్యాసుణ్ణి భాగవత రచనకు ప్రేరణ చేస్తే శుకుడా వ్యాసరచితమైన భాగవతాన్ని ప్రచారం చేశాడు. వీరిలో శుకుడు వైరాగ్యమనే భావానికి సంకేతమైతే నారదుడు అభ్యాసానికి ప్రతీక. అభ్యాస వైరాగ్యాలే మోక్షవిద్య కాలంబనాలు. మానవుడి మనస్సు కొకటి అనులోమంగా మరొకటి ప్రతిలోమంగా చక్కని శిక్షణ ఇచ్చి చివరకు మోక్షఫలాన్ని తప్పకుండా ప్రసాదిస్తాయి. “అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే” అని గీత బోధించటంలో ఇదే తాత్పర్యం. "అభ్యాస వైరాగ్యాభ్యామ్ తన్నిరోధః” అనే పాతంజల సూత్రానికి కూడా ఇదే ధ్యేయం. పోతే ఈ అభ్యాస వైరాగ్యాలేవో కావు మరలా. మనమింతకు ముందు నుంచీ చెప్పుకొనే సత్య ధర్మాలకు మారు పేర్లే. సత్యమే వైరాగ్యం ధర్మమే అభ్యాసం. సత్యమనేది
Page 50