#


Index

భాగవత ప్రాశస్త్యము

అపరం. దాని విభూతే ఈ జగత్తంతా. దీని జన్మస్థితి భంగాలకన్నింటికీ అదే కారణం. కారణముంటేనే కార్యం. లేకుంటే లేదు. ఇలా అన్వయ వ్యతిరేకాలను బట్టి చూస్తే ఈ కనిపించే జగద్విభూతి అంతా దానికే మాత్రమూ భిన్నం కాదు. పోతే అది ఏమిటీ ఎలా ఉంటుందా స్వరూపం. అర్థేష్వభిజ్ఞః స్వరాట్. అన్ని విషయాలూ తెలుసుకొనేది స్వతస్సిద్ధమైనదీ అది. అంటే చిద్రూపం - సద్రూపమని భావం. తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే - అలాంటి ఆ శుద్ధమైన సచ్చిద్రూపాన్ని ఆకళించుకొని అనుభవానికి తెచ్చుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు. ఆగమ జ్ఞానమనే దీప ప్రకాశంలోనే మనకది అవగాహనకు వచ్చేది. బ్రహ్మమంటే అలాటి శబ్ద బ్రహ్మం. లేదా బ్రహ్మాకార భావన. దానిపాటికది కలగదు. సద్గురూప దేశం కావాలి దానికి. ఆది గురువా నారాయణుడే. ఆయనే ఆది కవి హిరణ్యగర్భుడికి ప్రపథమంగా అనుగ్రహించాడా విద్య. భగవదను గ్రహమే లేకపోతే ముహ్యంతి యత్సూరయః ఎంత మేధావంతులైనా స్వయంగా ఊహించి పట్టుకొనే విషయం కాదు. ఏమి. ఎందుకని. "తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా తేజో బన్న రూపంగా త్రివృత్కృతమైన ఈ సృష్టి అంతా విచారిస్తే అసలు నిజంగా సృష్టి కాలేదు. అయినట్టు భాసిస్తున్నదంత మాత్రమే. ఎంచేత. ఆ సచ్చిత్తులే ఈ త్రిగుణాత్మకమైన జగత్తుగా మరొక వేషం వేసుకొని కనిపిస్తున్నది మనకు. దీనికే సంస్థానమని పేరు. మృత్తికే ఘటశరావాది రూపాలుగా సంస్థితమై కనిపిస్తుంది. ఈ సంస్థానాలా మూలపదార్థం కంటే వ్యతిరిక్తం కాదు గదా. అలాగే చైతన్యమే ఆయా చరాచర పదార్ధాలుగా భాసిస్తుంది కాబట్టి అంతా చైతన్యమే. తద్భిన్నంగా ఏదీ సృష్టి కాలేదసలు. కనుకనే అది అపరమైతే ఇది పరమని చెప్పటం.

  అయితే అంతా అదే అయిన నాడు నామరూపాది సృష్టి మనకిలా నిత్యమూ ఎందుకు ప్రత్యక్షమవుతున్నది. అసత్యమైనా ఎలా గోచరిస్తున్నది. అదే మాయ. కుహకమంటే మాయే. లేనిదున్నట్లు భాసిస్తే అది మాయగాక మరేమిటి. అందుకే ఇది ఎందుకు ఎలా అని ప్రశ్నలేదు. ఎలా తొలగించుకోవాలనే మనం వేయవలసిన ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు అన్వేషిస్తూ పోతే అది ఆఖరయ్యే సరికన్ని ప్రశ్నలకూ అక్కడే పరిష్కారం లభిస్తుంది. "ధామ్నా స్వేన సదా నిరస్తకుహక" మనే మాట కర్థం. కుహక మనేది నిరస్తం కావాలి ఇంతకూ దాన్ని నిరాసం చేయాలంటే ఏమిటి

Page 45

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు