#


Index

భాగవత ప్రాశస్త్యము

ధర్మః ప్రోజ్ఞిత కైతవో 2 త్రపరమో నిర్మత్స రాణామ్ సతామ్
వేద్యం వాస్తవ మత్ర వస్తు శివదమ్ తాపత్రయో న్మూలనమ్
శ్రీమద్భాగవతే మహాముని కృతే - కిమ్ వా పరైః కేశవ
స్సద్యో హృద్యవరుధ్యతే 2 త్ర కృతిభి-శ్శు శ్రూషు భి స్తత్ క్షణాత్

  ఇందులో మొదటి శ్లోకం సత్యాన్నీ రెండవ శ్లోకం ధర్మాన్నీ పేర్కొంటున్నాయి. భాగవత పురాణం లోకానికి బోధించే అమూల్యమైన రహస్యాలివి రెండే. ఇవి రెండే మానవ జీవితానికి కావలసిన పరమార్థం కూడా. ఇంతకు మించి మరేదీ లేదు. ఇందులో సత్యమనేది త్రికాలా బాధ్యమై శుద్ధ చైతన్య రూపమై సర్వ వ్యాపకమై ఎప్పటికీ చెడని పదార్ధం. అది మన స్వరూపమే. అదే మన జీవిత గమ్యం. పోతే ఆ గమ్యాన్ని చేర్చే గమకం రెండవదైన ధర్మం. అది గమ్యమైతే ఇది గమకం. అది లక్ష్యమైతే ఇది లక్షణం. అది సాధ్యమైతే ఇది సాధనం. ఒకటి చెప్పవలసినది. మరొకటి చేయవలసినది. కనుకనే "సత్యం వద ధర్మం చర” అన్న దుపనిషద్వాణి. సత్యం చేసేది గాదు. ధర్మం చెప్పేది గాదు. చెబితే చాలు సత్యం. చేసి తీరాలి ధర్మం. అంటే ఏమన్నమాట. సత్యమనేది జీవిత ధ్యేయంగా పెట్టుకొని ధర్మాన్ని పట్టుకొని పయనిస్తే అది ఎప్పటికైనా మనల నాధ్యేయాన్ని చేరుస్తుంది. అది ఇక మన స్వరూపమే కాబట్టి దానితో తాదాత్మ్యాన్ని భజిస్తే అది మానవుడికి మోక్షఫలాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈ సత్య ధర్మాలే ఏ మానవుడికైనా ఏ విద్య అయినా బోధించవలసింది. తద్వారా మానవుడు సాధించవలసింది.

  రెండు మాటలూ మనకు వైదిక వాఙ్మయంలోనే సాక్షాత్కరిస్తాయి. వాటి అర్థం కూడా మనకు విదిత పూర్వమే. కాని ఇక్కడ భాగవత మారెండు మాటలనూ ఏ అర్థంలో ప్రయోగిస్తున్నదో అది కొంచెం సావధానంగా పరిశీలించవలసి ఉంది. శాస్త్రంలో సత్యమంటే కర్మఫలమైన స్వర్గం కావచ్చు. అపర విద్యా ఫలమైన హిరణ్యగర్భలోక ప్రాప్తి కావచ్చు. అవి రెండూ ఆపేక్షికమైన సత్యమే గాని నిరపేక్షమైనది కాదు. ప్రస్తుతం భాగవతం వర్ణించేది కేవలం నిరపేక్షమైన పరిపూర్ణమైన సత్యం. అది ఎలాంటిదో మరి దాని లక్షణమేమిటో వివరిస్తున్నాడు. జన్మాద్యస్యయతః స్వతహాగా అది పరమైనా అదే మరలా అపరం కూడా. స్వరూపతః పరమైతే విభూతితః

Page 44

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు